CPM Leader CH Baburao : అదానీ మీటర్లపై డిస్కమ్ వెనుకడుగు..!
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:16 AM
‘ప్రజా పోరాటాల ఫలితంగా గృహాలకు అదానీ మీటర్లు బిగించడంపై డిస్కమ్‌లు వెనుకడుగు వేశాయి.

ఇది ప్రజాందోళన విజయం: సీపీఎం బాబూరావు
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘ప్రజా పోరాటాల ఫలితంగా గృహాలకు అదానీ మీటర్లు బిగించడంపై డిస్కమ్‌లు వెనుకడుగు వేశాయి. ఇది ప్రజా విజయం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్. బాబూరావు అన్నారు. ఆయన ఈమేరకు శనివారం ఓ ప్రకటన చేశారు. ‘గుంటూరు సుందరయ్య నగర్‌లో అదానీ స్మార్ట్ మీటర్లను 16 ఇళ్లకు అమర్చిన సిబ్బంది వెనక్కు మళ్లారు. మీటర్లును తొలగించి మళ్లీ సాధారణ మీటర్లను అమర్చారు’ అని బాబూరావు తెలిపారు. దీనిపై ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోశ్‌రావు శనివారం స్పందించారు. ‘నెలకు 200 యూనిట్లు దాటిన గృహ విద్యుత్తు వినియోగదారులకు మాత్రమే అదానీ స్మార్ట్ మీటర్ల ను బిగిస్తాం. అదానీ స్మార్టు మీటర్ల విషయంలో వెనుకంజ వేయలేదు’ అని స్పష్టం చేశారు.