Janga Krishna Murthy: వైసీపీలో ఎవరినైనా వాడుకొని వదిలేస్తారు
ABN , Publish Date - May 16 , 2024 | 12:54 PM
తనపై అనర్హత వేటు కక్షపూరిత చర్య అని ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి తెలిపారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే వేటు వేశారన్నారు. ఈ వేటును బీసీలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదన్నారు. తన బీసీ వర్గాలకు ఇచ్చిన పదవి అని పేర్కొన్నారు. చైర్మన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి తనపై వేటు వేయించారన్నారు.
గుంటూరు: తనపై అనర్హత వేటు కక్షపూరిత చర్య అని ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి తెలిపారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే వేటు వేశారన్నారు. ఈ వేటును బీసీలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదన్నారు. తన బీసీ వర్గాలకు ఇచ్చిన పదవి అని పేర్కొన్నారు. చైర్మన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి తనపై వేటు వేయించారన్నారు. వల్లభనేని వంశీ, మద్గాలి గిరిలపై రెండేళ్ల పాటు ఎందుకు చర్యలు తీసుకోలేదని జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. బీసీల నాయకత్వాన్ని అగణదొక్కే ప్రయత్నం వైసీపీ చేసిందన్నారు. వైసీపీలో ఎవరినైనా వాడుకొని వదిలేస్తారని జంగా కృష్ణమూర్తి తెలిపారు.
Chandrababu Naidu: మారిన చంద్రబాబును చూస్తారు
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేసింది. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఇటీవల ఆ పార్టీ విధానాలు నచ్చక.. ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని మండలిలో వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు.. కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ బుధవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest AP News AND Telugu News