Share News

Kakinada: జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ABN , Publish Date - Nov 28 , 2024 | 07:46 AM

కాకినాడ: జీజీహెచ్‌లో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. డయాలసిస్ కోసం వచ్చిన రోగికి ఓ పాజిటివ్ బదులు హౌస్ సర్జన్ ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో పేషెంట్ భావన శిరీష(34) అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలోనే మరణించింది.

Kakinada: జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

కాకినాడ: జీజీహెచ్‌ (GGH)లో దారుణం (Atrocities).. వైద్యుల నిర్లక్ష్యానికి (Doctors Negligence) నిండు ప్రాణం బలైంది. డయాలసిస్ కోసం వచ్చిన రోగికి ఓ పాజిటివ్ బదులు హౌస్ సర్జన్ ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో పేషెంట్ భావన శిరీష(34) అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలోనే మరణించింది. పాలకొల్లుకు చెందిన శిరీష ఆమె నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. మెరుగైన వైద్యం కోసం ఈనెల 4న కాకినాడలోని జీజిహెచ్‌కు వచ్చింది. ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో 'ఓ పాజిటివ్' గ్రూపు ఎక్కించాలని వైద్యులు సూచించారు.


అయితే విధుల్లో ఉన్న హౌస్ సర్జన్ పేషెంట్ శిరీషకు ఓ పాజిటివ్‌కు బదులు ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో ఆక్సిజన్ శాతం పడిపోయి ఆమె మృతి చెందింది. దీంతో ఆసుపత్రి ఉన్నతాధి కారులు విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళారు. బాధితురాలి కుటుంబసభ్యులకు నష్ట పరిహారంగా రూ.3 లక్షల చెక్కు అందించి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. అలాగే విచారణ కమిటీ నియమిస్తామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం

తుఫాన్ గండం..

రైతు బంధుపై కీలక ప్రకటన

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 28 , 2024 | 07:46 AM