Share News

Minister Nimmala: 34 మంది వృద్ధుల మృతికి జగన్ బాధ్యుడు..

ABN , Publish Date - Jul 02 , 2024 | 11:27 AM

ప.గో.జిల్లా: పింఛన్ తీసుకోవడానికి వచ్చి మండుటెండలు తట్టుకోలేక మరణించిన 34 మంది వృద్ధుల మృతికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడని, వృద్ధుల మరణానికి కారణమైన జగన్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Minister Nimmala: 34 మంది వృద్ధుల మృతికి జగన్ బాధ్యుడు..

* జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

* జగన్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడు

* గతంలో పింఛన్ల పంపిణీకి మూడు రోజుల సమయం

* ఒక్క రోజులోనే 95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి..

* ఇది ప్రభుత్వ విజయం: మంత్రి నిమ్మల..


ప.గో.జిల్లా: పింఛన్ తీసుకోవడానికి వచ్చి మండుటెండలు తట్టుకోలేక మరణించిన 34 మంది వృద్ధుల (34 Elderly people) మృతికి (Death) మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan) బాధ్యుడని, వృద్ధుల మరణానికి కారణమైన జగన్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అన్నారు. మంగళవారం ఆయన పాలకొల్లు (Palakollu)లో మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్‌కు ముందు పెన్షన్ల పంపిణీలో వృద్ధులను వేధించి విపక్షాలపై ఆ నెపం నెట్టేలా జగన్ కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. గతంలో పింఛన్ల పంపిణీకి మూడు రోజుల సమయం తీసుకుంటే నిన్న ఒక్కరోజులోనే 95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయడం జరిగిందని, ఇది ప్రభుత్వ విజయమని మంత్రి అన్నారు.


జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు సామాజిక పెన్షన్లు ఇళ్ల వద్ద పంపిణీ చేయకుండా జగన్ చేసిన కుట్ర నేడు కళ్ళకు కట్టినట్లు రుజువైందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సచివాలయ ఉద్యోగులు నేరుగా ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసే వ్యవస్థ మనకు ఉందని, నిన్న రాష్ట్రంలో 95 శాతం పంపిణీ జరిగిన తీరును చూస్తే తెలుస్తోందన్నారు. ఎన్నికల సమయంలో 34 మంది పెన్షనదార్ల మరణాలు ముమ్మాటికి జగన్ హత్యలని రుజువయ్యాయన్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ చేయవచ్చని నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన జగన్ పట్టించుకోలేదని అన్నారు. పెంచిన పెన్షన్లను విడతలవారీగా కాకుండా ఒకేసారి హామీ ఇచ్చిన రోజు నుంచే అమలు చేయడంతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం, ఇళ్లల్లో పండుగ వాతావరణం కనిపించిందన్నారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చిన జగన్ పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..

ఈనెల 6న చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ..

విద్యుత్ రంగంలో జగన్ అక్రమాలు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

బాబు అనుభవంతోనే ఇది సాధ్యం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 02 , 2024 | 11:29 AM