రైతుల సమస్యలు పరిష్కరించాకే భూ కేటాయింపులు : యనమల
ABN , Publish Date - Aug 30 , 2024 | 11:30 PM
తుని రూరల్, ఆగస్టు 30: రైతుల సమస్యలు పరిష్కరించాకే భూ కేటాయింపులు జరగాలని శాసన మండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమ
తుని రూరల్, ఆగస్టు 30: రైతుల సమస్యలు పరిష్కరించాకే భూ కేటాయింపులు జరగాలని శాసన మండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. తేటగుంట టీడీపీ కార్యాలయంలో పెద్దాపురం ఆర్డీవో సీతారామం, తొండంగి తహసీల్దార్ మురార్జీలతో ఆయన మాట్లాడారు. ఎస్‌ఈజెడ్ పరిధిలో రైతుల నుంచి సేకరించిన 500ఎకరాల భూములకు సంబంధించి 500 మందికవ పరిహారం అందించాల్సి ఉందని తెలిపారు. గతంలో ఎకరానికి రూ.10లక్షలే చెల్లింపులు జరిగాయని, ఈ పరిహారినికి సానుకూలంగా లేని రైతులు అప్పట్లో నష్టపరిహారం తీసుకోలేదని గుర్తుచేశారు. ఇందుకు సంబంధించి రూ.59 కోట్లు కలెక్టరేట్‌లో డిపాజిట్ అయ్యాయన్నారు. గతంలో చెల్లించిన పరిహారం కన్నా ఎక్కువ మొత్తంలో పరిహారం ఆశిస్తున్నారని వారి మొత్తం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తగిన మొత్తంలో పరిహారం చెల్లించాలని అధికారులను ఆయన ఆదేశించారు.