Share News

AP Elections: పాపం కొడాలి.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

ABN , Publish Date - Apr 28 , 2024 | 09:17 AM

ఏదో జరుగుతుందనుకుంటే.. మరేదో జరిగిపోయి.. ఇంకేదో వివరణ ఇచ్చుకున్నట్టుగా తయారైంది గుడివాడ వైసీపీ(YCP) అభ్యర్థి కొడాలి నాని(Kodali Nani) తీరు. దాపరికానికి పోయి.. తాను సమర్పించిన నామినేషన్‌(Kodali Nani Nomination) పత్రంలో ప్రభుత్వ వసతినేమీ ఉపయోగించుకోలేదని దర్జాగా చెప్పుకొని..

AP Elections: పాపం కొడాలి.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..
Kodali Nani

విజయవాడ, ఏప్రిల్ 28: ఏదో జరుగుతుందనుకుంటే.. మరేదో జరిగిపోయి.. ఇంకేదో వివరణ ఇచ్చుకున్నట్టుగా తయారైంది గుడివాడ వైసీపీ(YCP) అభ్యర్థి కొడాలి నాని(Kodali Nani) తీరు. దాపరికానికి పోయి.. తాను సమర్పించిన నామినేషన్‌(Kodali Nani Nomination) పత్రంలో ప్రభుత్వ వసతినేమీ ఉపయోగించుకోలేదని దర్జాగా చెప్పుకొని.. విషయం బయటపడ్డాక కక్కలేక, మింగలేక వివరణ ఇచ్చుకున్నారు పాపం. గుడివాడలోని(Gudivada) పాత మున్సిపల్‌ కార్యాలయ భవనాన్ని ఐదేళ్లు పూర్తిగా వాడుకుని, ఎన్నికలకు ముందు ఖాళీ చేసిన ఆయన నామినేషన్‌ పత్రంలో మాత్రం.. తానేం ప్రభుత్వ వసతిని వినియోగించుకోలేదని పేర్కొన్నారు.


అసలు విషయాన్ని టీడీపీ నాయకులు బయటపెట్టడం, మీడియా రచ్చ చేయడం, రిటర్నింగ్‌ అధికారి నోటీసులు జారీచేయడంతో ఏం పాలుపోలేక జుట్టు పీక్కున్నారు. చివరికి.. పాత మున్సిపల్‌ కార్యాలయ భవనాన్ని తాను వసతి గృహంగా వినియోగించుకోలేదని, కార్యాలయంగా మాత్రమే వాడుకున్నానని, మున్సిపాలిటీకి చెల్లించాల్సిన అద్దెను పూర్తిస్థాయిలో చెల్లించానని నోటీసుకు బదులిచ్చుకున్నారు. ఈ ఎపిసోడ్‌ అంతా పరిశీలిస్తున్న గుడివాడ వాసులు మాత్రం కార్యాలయ భవనంగా వినియోగించుకున్నా వసతి కిందకే వస్తుంది కదా అని ముక్కున వేలేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ.. కొడాలి నానికి మాత్రం ఈ విషయంలో వెలక్కాయ పడినట్లయ్యిందనేది సత్యం.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 28 , 2024 | 09:32 AM