AP Elections 2024:ఉదయగిరిలో వైసీపీకి ఏకపక్షంగా సహకరిస్తున్న ఎన్నికల అధికారి.. ప్రతిపక్షాల ఆగ్రహం
ABN , Publish Date - May 03 , 2024 | 03:41 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) ఈ నెల 13న జరుగుతుండటంతో అధికార వైఎస్సార్సీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పలు కుట్రలకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే కొంతమంది అధికారులు జగన్ పార్టీకి తొత్తులుగా మారారనే ఆరోపణలు వస్తున్నాయి.
నెల్లూరు: ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) ఈ నెల 13న జరుగుతుండటంతో అధికార వైఎస్సార్సీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పలు కుట్రలకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే కొంతమంది అధికారులు జగన్ పార్టీకి తొత్తులుగా మారారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు చేపట్టినా.. వైసీపీ నేతలు, అధికారులు తుంగలో తొక్కుతున్నారు. అయితే ఉదయగిరిలో ఎన్నికల అధికారి రమేశ్ ప్రేమ్ కుమార్ వైసీపీ తరుపున ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
Chandrababu: ‘ఈ మారణ హోమానికి ఏ1 జగన్, ఏ2 మీరే’.. పెన్షనర్ల కష్టాలపై చంద్రబాబు ఆగ్రహం
అధికార పార్టీ వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి అందించినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ప్రతిపక్ష పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు, వారి అనుచరులు ఎండలో పడిగాపులు కాస్తున్నారు. ఉదయగిరి ఎన్నికల అధికారి ప్రభుత్వంలోని కీలక అధికారుల కనుసన్నల్లో పని చేస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఆ అధికారిపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి కొమ్మకాస్తున్న రమేశ్ ప్రేమ్ కుమార్‌పై ఎన్నికల కమిషన్‌కు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
AP News: మళ్లీ జగన్ వస్తే.. జరిగేది ఇదే..
Read Latest AP News And Telugu News