Share News

Elections 2024: సైకో ప్రభుత్వాన్ని తరిమితేనే రాష్ట్రానికి మంచి రోజులు.. బాలకృష్ణ

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:04 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ( AP Elections 2024 ) వేళ ముఖ్య నేతలందరూ ప్రచారం ముమ్మరం చేశారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేపట్టారు.

Elections 2024:  సైకో ప్రభుత్వాన్ని తరిమితేనే రాష్ట్రానికి మంచి రోజులు.. బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ( AP Elections 2024 ) వేళ ముఖ్య నేతలందరూ ప్రచారం ముమ్మరం చేశారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రజలను సైకో జగన్ జలగల్లా పీల్చుతున్నారని బహిరంగ సభలో ఫైర్ అయ్యారు. తల్లి, చెల్లిని రోడ్డుపైకి తీసుకువచ్చి సొంత బాబాయ్ ను హత్య చేసిన వారిని కాపాడుతున్నారని విమర్శించారు. రాయలసీమలో చంద్రబాబు సాగునీరు పారిస్తే జగన్ మాత్రం రక్తం పారిస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ తో అన్ని వర్గాలను నిండా ముంచారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న బాలకృష్ణ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు.


Hyderabad: కాయ్ రాజా కాయ్.. ఆన్ లైన్ లో జోరుగా బెట్టింగ్.. కట్ చేస్తే..

టీడీపీ హయాంలో ముస్లింల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. జగన్ వచ్చిన తర్వాత ఆ పథకాలను రద్దు చేశారు. సైకో ప్రభుత్వాన్ని తరిమితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. 20 ఏళ్లుగా మీ కోసం బతుకుతున్న వ్యక్తి కందికుంట వెంకట ప్రసాద్. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తిని గెలిపించండి. రాబోయే రణరంగంలో డబ్బు, మద్యం, మాంసానికి మోసపోవద్దు. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి.

- నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే


Elections 2024: జగన్ అంటే అబద్దం...చంద్రబాబు అంటే నిజం.. టీడీపీ

కాగా.. స్వర్ణాంధ్ర సాకార యాత్ర హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ యాత్రను సత్యసాయి జిల్లా కదిరి నుంచి ప్రారంభించారు. హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​లో కదిరికి చేరుకున్న బాలకృష్ణ శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అమృతవల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 13 , 2024 | 07:07 PM