AP Elections 2024: ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 26 , 2024 | 07:40 PM
వైసీపీ (YSRCP)కి ఈ ఎన్నికల్లో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. శుక్రవారం నాడు రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా: వైసీపీ (YSRCP)కి ఈ ఎన్నికల్లో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. శుక్రవారం నాడు రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని జోస్యం చెప్పారు.
Andhra Pradesh: పసుపు అడ్డాలో పట్టు ఎవరిదో?
వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. రైతులకు నీరందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని పవన్ అన్నారు. తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని కోనసీమ రైతులకు మాటిచ్చారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రూ.200కోట్లు సంపాదిస్తేనే రూ.70 కోట్లు ట్యాక్స్ కట్టగలనని వివరించారు. తనకు రాజకీయాల్లో డబ్బు సంపాదన అవసరం లేదని పవన్ స్పష్టం చేశారు. మీ కష్టాల్ని తీర్చడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు.
TDP: వైఎస్ షర్మిల నిన్న ఒక రహస్యం చెప్పారు: కనకమేడల
తన మీద నమ్మకంతో రాపాక వరప్రసాద్‌ని గత ఎన్నికల్లో గెలిపిస్తే పార్టీకి నమ్మించి ద్రోహం చేశారని విరుచుకుపడ్డారు. ఆయన ఐదు ఎకరాల్లో ఇళ్లు కట్టుకున్నారని ఆరోపించారు. రైతుల కష్టాలను రాపాక వరప్రసాద్ తీర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక డ్రైవర్‌ను చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారన్నారు. మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌పై విజయవాడ ఎన్నికల ప్రచారంలో చిన్న గులకరాయి పడితేనే ఓ యువకుడిపై కేసుపెట్టారని దుయ్యబట్టారు. అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితులను ఎందుకు పట్టుకోలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
AP Elections: మేమెప్పుడూ బీజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరగలేదన్న బొత్స
AP Elections: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్..!
Read Latest Election News or Telugu News