Jagan: పులివెందులకు జగన్.. స్పీకర్ ఎన్నికకు డుమ్మా?
ABN , Publish Date - Jun 22 , 2024 | 08:41 AM
స్పీకర్ ఎన్నికకు వైసీపీ అధినేత జగన్ డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. సభా సంప్రదాయాలు ప్రకారం నిన్ననే స్పీకర్ ఎన్నిక గురించి వైసీపీ నేతలకు అధికారపక్షం చెప్పింది. అయినా కూడా ఆ పార్టీ అధినేత స్పీకర్ ఎన్నిక పట్ల ఆసక్తి కనబరచకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అమరావతి: స్పీకర్ ఎన్నికకు వైసీపీ అధినేత జగన్ డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. సభా సంప్రదాయాలు ప్రకారం నిన్ననే స్పీకర్ ఎన్నిక గురించి వైసీపీ నేతలకు అధికారపక్షం చెప్పింది. అయినా కూడా ఆ పార్టీ అధినేత స్పీకర్ ఎన్నిక పట్ల ఆసక్తి కనబరచకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నిక గురించి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సభా సాంప్రదాయాల ప్రకారం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. స్పీకర్ ఎన్నికలో పాల్గొనాలని సూచించారు. పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కు కూడా చెప్పాలని పెద్దిరెడ్డిని కేశవ్ కోరారు.
సభా సంప్రదాయాలను పాటించి చెప్పినప్పటికీ ఈ రోజు జగన్ రావడం లేదని సమాచారం. పులివెందుల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిన్న కూడా జగన్ సభా మర్యాదను పాటించిందే లేదు. కనీసం తమ పార్టీ సభ్యులు ప్రమాణం స్వీకారం పూర్తయ్యే వరకూ కూడా ఆగలేదు. సహ నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా తాను మాత్రం ప్రమాణం చేసేసుకుని సభ నుంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు, ముఖ్యమంత్రిగా ఐదేళ్లు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. సభలో శుక్రవారం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. శాసనసభ మర్యాదలు, సంప్రదాయాల మేరకు సహచర సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయి.. ప్రొటెం స్పీకర్ సభను వాయిదా వేసే వరకూ సభ్యులందరూ సభలోనే ఉంటారు. ఈ మర్యాదను జగన్ పాటించలేదు.