AP News: చల్లా బాబు.. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు..: ఎంపీ మిథున్ రెడ్డి
ABN , Publish Date - Jun 30 , 2024 | 11:40 AM
తిరుపతి: ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ నేతలు పాల్పడుతున్నారని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని, పుంగనూరులో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.
తిరుపతి: ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు (Punganur) అసెంబ్లీ (Assembly), రాజంపేట పార్లమెంట్ (Rajampet Parliament) పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ నేతలు (TDP Leaders) పాల్పడుతున్నారని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని, పుంగనూరులో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన రాజాంపేటలో మీడియాతో మాట్లాడుతూ.. జేసీబీలు తెచ్చి పేదల ఇల్లు కులదోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమన్నారు.
ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఈరోజు పుంగనూరులో ఉందని, తమ వారిని ప్రరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని, నియోజకవర్గంలో తనను పర్యటించకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయం స్పీకర్ దృష్టికి తీసుకువెళతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. తమకు ఓటు వేసిన 40 శాతం మందిని రాష్ట్రం నుంచి తరిమేస్తారా ? అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మేము అండగా ఉంటామని, పార్టీ మారమని తమ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిడి చేసి, ప్రలోభాలు చేయడం ద్వారా పార్టీలు మార్పిస్తే లాభం లేదన్నారు.
తాను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని, చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్న.. ఇలాంటివి ఎప్పుడు లేవని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని చల్లా బాబుకు సలహా ఇస్తున్నానన్నారు. పోలీసులపై దాడి చేసి చల్లా బాబు జైలుకు వెళ్ళారని, తాను అరెస్టుకైనా, ప్రణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పస్టం చేశారు. మంత్రి పదవి భద్రపరుచుకోవడం కోసం రాం ప్రసాద్ కూడా మాపై అనేక విమర్శలు చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజీనామా..
ఏపీలో పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..
భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News