Durgamma: దుర్గమ్మ దర్శనం.. వీఐపీల కోసం ప్రత్యేక యాప్
ABN , Publish Date - Oct 04 , 2024 | 10:46 AM
Andhrapradesh: పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవిని దర్శించుకుని భక్తులు తరిస్తారు. మరోవైపు దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వీఐపీలు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
విజయవాడ, అక్టోబర్ 4: ఇంద్రకీలాద్రిపై దేవీనవరాత్రి ఉత్సవాలు (Devinavaratri Celebrations) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజుకి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు చేరుకున్నాయి. ఈరోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవిని దర్శించుకుని భక్తులు తరిస్తారు. మరోవైపు దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వీఐపీలు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
Posters: సిగ్గు.. సిగ్గు అంటూ పోస్టర్లు.. ఎందుకంటే..
ఈరోజు ఉదయం విజయవాడ సీపీ రాజశేఖర్ అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చి దుర్గమ్మను సీపీ రాజశేఖర్ బాబు దర్శనం చేసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనానికి వెళ్లే వీఐపీల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను క్రియేట్ చేసినట్లు తెలిపారు. ఆ యాప్ ద్వారా వీఐపీలు వారి టైం స్లాట్‌ను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తాము కూడా ఆ యాప్ ద్వారా టైం స్లాట్ బుక్ చేసుకొని దర్శనానికి వచ్చామని తెలిపారు. ఆ టైం స్లాట్ ప్రకారం అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు.
ఇలా యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి అనే రూల్ పెట్టడం ద్వారా వీఐపీలను తాకిడిని నిలుపుదల చేయవచ్చన్నారు. వీఐపీలు ఎంత తక్కువ మంది వస్తే సామాన్య భక్తులకు దర్శన సౌకర్యాన్ని అందించగలుగుతామనే ఉద్దేశంతో యాప్‌ను క్రియేట్ చేశామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీఠ వేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వీఐపీల వాహనాలు పున్నమిఘాటు వద్దకు పెట్టి అక్కడ దేవస్థానం ఏర్పాటు చేసిన వెహికల్స్‌లో మాత్రమే దర్శనానికి రావాలని సీపీ రాజశేఖర్ సూచించారు.
Secunderabad to Goa: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఇకపై 2 ట్రైన్లు
దుర్గమ్మ సన్నిధికి ఎంపీ కేశినేని..
గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని ఎంపీ కేశినేని చిన్ని దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ దసరా ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవని చెప్పారు. సామాన్య భక్తులందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా సీఎం చంద్రబాబు ఆదేశాలు, సూచనలతో దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. వీఐపీల కోసం ప్రత్యేకమైన యాప్‌ను క్రియేట్ చేశామన్నారు. ఈ యాప్ ద్వారా వీఐపీలు దర్శించుకునే విధంగా టైం స్లాట్‌ను ఏర్పాటు చేశారని.. సామాన్య భక్తులకు పెద్దపీఠం వేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Posters: సిగ్గు.. సిగ్గు అంటూ పోస్టర్లు.. ఎందుకంటే..
KTR: ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందించిన కేటీఆర్.. కలల సౌధం ఖరీదు 25 వేలు అంటూ విమర్శలు
Read Latest AP News And Telugu News