Madanapalli Incident: తెల్లవారేవరకు మదనపల్లి సబ్‌కలెక్టరేట్‌లోనే సీఐడీ అధికారుల తిష్ట
ABN , Publish Date - Aug 27 , 2024 | 10:49 AM
Andhrapradesh: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్‌కలెక్టరేట్‌లో అగ్నిప్రమాద ఘటనలో సీఐడీ విచారణ కొనసాగుతోంది. రాత్రి 12:30 గంటల వరకు వీఆర్ఏ రమణయ్య, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అధికారులు విచారించారు. వీడియో రికార్డింగ్ మధ్య సీన్‌ను రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఇద్దరు అనుమానితులను విచారించారు. అగ్నిప్రమాద ఘటన సమయంలో ఎక్కడి నుంచి మంటలు వ్యాపించాయి,
అన్నమయ్య జిల్లా, ఆగస్టు 27: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్‌కలెక్టరేట్‌లో (Madanapalli fire Incident) అగ్నిప్రమాద ఘటనలో సీఐడీ విచారణ కొనసాగుతోంది. రాత్రి 12:30 గంటల వరకు వీఆర్ఏ రమణయ్య, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అధికారులు విచారించారు. వీడియో రికార్డింగ్ మధ్య సీన్‌ను రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఇద్దరు అనుమానితులను విచారించారు. అగ్నిప్రమాద ఘటన సమయంలో ఎక్కడి నుంచి మంటలు వ్యాపించాయి, ఎంతవరకు ఫైళ్లు దహనమయ్యాయి అనే కోణంలో ఫైర్ అధికారులను కూడా సీఐడీ అధికారులు విచారించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సబ్ కలెక్టరేట్‌లోనే సీఐడీ అధికారులు తిష్ట వేసి మరీ విచారణను చేపట్టారు.
కాగా.. అగ్నిప్రమాదంలో ఫైళ్ల దగ్ధం అయిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా నిజనిజాలు బయటపెట్టాలనే ఉద్దేశంతోకేసును ఈనెల 8న పోలీసుల నుంచి సీఐడీకి బదిలీ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత రాత్రి అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ రాజ్‌కమల్, సీఐడీ డీఎస్పీ వేణగోపాల్ ఆధ్వర్యంలో విచారణను మొదలుపెట్టారు. జూలై 21న రాత్రి సమయంలో మదనపల్లి సబ్‌కలెక్టరేట్ కార్యాయలంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 22-ఏ సెక్షన్లో కీలకమైన పైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వైసీపీ నేతల అక్రమాలు బయటకురాకుండా ఇలాంటి చర్యలు పాల్పిడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న అగ్రహారం వీఆర్ఏ.. ఆర్డీఏకు సమాచారం అందజేశాడు. ఆర్డీఏ సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో పరిగణించింది.
Chandrababu: నీతి ఆయోగ్ ప్రతినిధులతో నేడు చంద్రబాబు సమావేశం
డీజీపీ తిరుమలారావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌ను ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఘటనా స్థలికి ప్రభుత్వం పంపించింది. అయితే ప్రమాదస్థలిని పరిశీలించిన పోలీసులు ఉన్నతాధికారులు.. ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లను కాల్చివేశారని తేల్చిచెప్పారు. దీంతో ఈకేసును సీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. విచారణలో భాగంగా వీఆర్‌ఏ రమణయ్య, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, ఇద్దరు ఆర్డీవోలను పోలీసులు విచారించారు. అంతేకాకుండా మదనపల్లి తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ జింకా వెంకటచలపతి, పెద్దిరెడ్డి ముఖ్యఅనుచురుడు వి.మాధవరెడ్డి, శశిధర్ రెడ్డి ఇళల్లో సోదాలు చేసిన పోలీసులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. వీరందరిపైన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. అయితే సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి పలువురిని రహస్యంగా విచారించగా పలు పుకార్లు షికార్లు చేసినేపథ్యంలో ఈనెల 23 నుంచి ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.
ఇవి కూడా చదవండి...
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై సర్వత్రా ఉత్కంఠ..
Viral Vidoe: పార్కింగ్ విషయంలో లొల్లి.. బ్యాట్‌తో కారును ధ్వంసం చేసి హల్‌చల్
Read Latest AP News And Telugu News