Share News

CM Chandrababu: అందరికీ వరదసాయం అందాకే ఆ కార్యక్రమం..

ABN , Publish Date - Sep 30 , 2024 | 07:57 AM

భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లకు పరిహారం సాయం ప్రభుత్వం అందజేస్తోంది. ఆస్తి, పంట నష్టం కింద 4 లక్షల మందికి రూ. 602 కోట్లు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రజల అకౌంట్లలో ఇప్పటివరకు రూ. 569 కోట్లు జమ అయ్యాయి.

CM Chandrababu: అందరికీ  వరదసాయం అందాకే ఆ కార్యక్రమం..

అమరావతి: వరద సాయంలో పగలు, రాత్రి కష్టపడి పనిచేసిన అధికారులు (Officers), ప్రభుత్వ ఉద్యోగులు (Govt. Employees), స్వచ్చంధ సంస్ధలు, పారిశుధ్య కార్మికులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం వాయిదా పడింది. వరద సాయం కార్యక్రమంలో భాగస్వాములు అయిన వారితో సోమవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu)భావించారు. అయితే బాధితులందరికీ పూర్తిస్థాయిలో వరదసాయం అందాకే ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దీంతో ఈరోజు విజయవాడ కలెక్టరేట్లో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం వాయిదా పడింది.

భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లకు పరిహారం సాయం ప్రభుత్వం అందజేస్తోంది. ఆస్తి, పంట నష్టం కింద 4 లక్షల మందికి రూ. 602 కోట్లు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రజల అకౌంట్లలో ఇప్పటివరకు రూ. 569 కోట్లు జమ అయ్యాయి. కొంతమంది బ్యాంక్ అకౌంట్‌లు యాక్టివ్‌గా లేకపోవడం వంటి కారణాలతో పరిహారం పెండింగ్‌లో ఉన్నవారికి ఈరోజు చెల్లింపులు పూర్తి కానున్నాయి.


రేపు సీఎం చంద్రబాబు పత్తికొండ పర్యటన

కాగా సీఎం చంద్రబాబు మంగళవారం కర్నూలు జిల్లా, పత్తికొండలో పర్యటించనున్నారు. పుచ్చకాయల మాడ గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎస్పీ బిందు మాధవ్‌, జేసీ నవ్యలు పరిశీలించారు. ఆదివారం సాయంత్రం పుచ్చకాయలమడ చేరుకున్న వారు ముందుగా గ్రామంలోని హైస్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. వాహనాల పార్కింగ్‌, పెన్షింగ్‌ వంటి అంశాలపై ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్‌ నుంచి ముఖ్యమంత్రి గ్రామంలోకి వెళ్లే మార్గంలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం ముఖ్యమంత్రి నుంచి పింఛన్లు అందుకునే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడతారు. ముఖ్యమంత్రి పింఛన్‌దారుల ఇంటికి వెళ్లి పింఛన్‌ అందిస్తారని, ఆయనకు ఇబ్బంది కలగకుండా ఆయా ఇళ్లలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆశించారు. అనంతరం గ్రామాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రారంభించనున్న పైలాన్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి దర్శించుకునే కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయంతోపాటు గ్రామ సభ నిర్వహించే సభాస్థలి ప్రాంతానికి చేరుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. పుచ్చకాయలమడ అభివృద్ధికి రూ.2.8 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. గ్రామంలోని వివిధ అభివృద్ధి పనులకు వీటిని వినియోగిస్తామని చెప్పారు.

కాగా ముఖ్యమంత్రి అక్టోబరు 1న ఉదయం (మంగళవారం) 11.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించి ప్రజా వేదిక కార్యక్రమంలో గ్రామస్థులతో మాట్లాడతారు. అనంతరం తిరిగి విజయవాడకు బయలుదేరి వెళతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నువ్వు అవినీతిపరుడివి.. నువ్వే నిందితుడివి!

బాబోయ్.. 100కిపై మొసళ్లను చంపేసిన రైతు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 30 , 2024 | 07:57 AM