Drone: డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా.. ఇప్పటి వరకు
ABN , Publish Date - Sep 03 , 2024 | 01:07 PM
Andhrapradesh: బెజవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహారం సరఫరా కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. హెలికాఫ్టర్లు, పడవలు ద్వారా వరద బాధితులకు ఆహారం, పాలు, మందులను సరఫరా చేస్తోంది.
అమరావతి, సెప్టెంబర్ 3: బెజవాడలో (Vijayawada) వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక చర్యలను ప్రభుత్వ (AP Govt) యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహారం సరఫరా కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. హెలికాఫ్టర్లు, పడవలు ద్వారా వరద బాధితులకు ఆహారం, పాలు, మందులను సరఫరా చేస్తోంది. అలాగే పడవలు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరాలను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా ఈరోజు ఉదయం విజయవాడలో డ్రోన్ల ద్వారా వరద సహాయాన్ని అందజేస్తోంది సర్కార్. పడవలు చేరుకోలేని వివిధ ప్రాంతాల్లో డ్రోన్‌లు ద్వారా ఫుడ్ పాకెట్లను సరఫరా చేసింది. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 16 డ్రోన్లు ద్వారా 10 వేల ఆహార పొట్లాలు సరఫరా అయ్యాయి. ఇంకా డ్రోన్‌ల ద్వారా సరఫరా కొనసాగుతోంది.
మరోవైపు వరద సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు అంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వాటిల్లొద్దని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం నుంచి జరిగిన ఆహారం పంపిణీ వివరాలను అధికారులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. 5 హెలీకాఫ్టర్ల ద్వారా ఆహారం పంపిణీ జరుగుతుందని అధికారులు వివరించారు. హెలికాఫ్టర్, పడవ, ట్రాక్టర్ల ద్వారా ఉదయం నుంచి ఆహారం, నీళ్లు అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
‘5 లక్షల ఆహారం, నీళ్ళ ప్యాకెట్లు సిద్ధం చేసి పంపిణీ జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని చోటకు హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలి. మూడు పూటలా ఆహారం అందించాలి. విజయవాడలో 36 డివిజన్లలో విధుల్లో ఉన్న అధికారులే ఆహార పంపణీకి బాధ్యత వహించాలి. క్షేత్ర స్థాయిలో ఆహారం అందింది లేనిది నిర్ధారించుకోవాలి. రెండు రోజులు వరదలో చిక్కుకుని ఆహారం, నీరు లేక పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థ చేసుకుని అధికారులు పనిచేయాలి. మన కుటుంబమే అలాంటి కష్టంలో ఉందనే ఆలోచనతో పనిచేయాలి. నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి అని’ అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Heavy Rains: పడవల ద్వారా ఆహారం సరఫరా.. కాసేపట్లో సింగ్‌నగర్‌కు చంద్రబాబు
Budameru: బుడమేరుకు తగ్గిన వరద.. గండ్లు పూడ్చివేత పనులు ప్రారంభం
Read Latest AP News And Telugu News