Share News

Nimmala Ramanaidu: కుటుంబసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నిమ్మల

ABN , Publish Date - Oct 09 , 2024 | 11:10 AM

Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను మంత్రి నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా అమ్మవారి సేవలో మంత్రి పాల్గొన్నారు.

Nimmala Ramanaidu: కుటుంబసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నిమ్మల
Minister Nimmala Ramanaidu

అమరావతి, అక్టోబర్ 9: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (Devinavaratri Celebrations) వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాలల్లో భాగంగా బుధవారం ఉదయం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా దుర్గమ్మను మంత్రి దర్శించుకున్నారు. దర్శనానంతరం నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారి కటాక్షం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలన్నారు. రాజధాని లేని రాష్ట్రమని.. అమ్మవారి దయతో రాజధాని త్వరితగతిన పుర్తి అవ్వాలని ఆశించారు. రాజధాని లేని ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలన్నారు.

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.


పోలవరం పూర్తికావాలని, కుంగిపోయిన విద్య వైద్య రంగాలు అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గతం కన్నా ఈసారి భక్తుల కోసం ఏర్పాట్లు దేవస్థానం వాళ్లు బాగా చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో దసరా క్యూలైన్లలో ఎన్నో కష్టాలు చూశామన్నారు. కానీ ఈ సారి క్యూ లైన్‌లో వాటర్ బాటిల్‌తో పాటు పాలు, మజ్జిగ అందిస్తున్నారన్నారు. సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన కల్పిస్తున్నారని చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఐవీఆర్ఎస్ నిర్వహిస్తే 92% సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి వెల్లడించారు.


అమ్మవారి సేవలో పవన్..

దసరా శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజు అమ్మవారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో డిప్యూటీ సీఎంకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కూతురు ఆధ్యతో పవన్ దర్శనానికి వచ్చారు. అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు హోం మంత్రి వంగలపూడి అనిత వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చూడగానే భక్తులలో ఉత్సాహం ఉరకలేసింది. జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.

Pawan Kalyan: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం..


ఏడవ రోజుకు ఉత్సవాలు..

కాగా.. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఏడో రోజుకి చేరుకున్నాయి. సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. సరస్వతి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రాత్రి ఒంటిగంట నుంచి క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. ఉత్సవాల సందర్భంగా అన్ని టిక్కెట్లు రద్దు చేసి, అన్ని క్యూలైన్లలో ఉచితంగా దర్శనం కల్పించారు. అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.


వినాయకుని గుడి వద్ద క్యూలైన్లు దాటి మరీ భక్తులు బారులు తీరారు. బాక్సుల విధానంలో రోప్‌ల‌ సాయంతో యాభై మంది చొప్పున భక్తులను క్యూలైన్‌లోకి పోలీసులు పంపుతున్నారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని సీపీ రాజశేఖర్ బాబు ముందస్తుగా అవసరమైన చర్యలు చేపట్టారు. కొండపైకి నేడు ఎటువంటి వాహనాలు అనుమతించమని పోలీసులు తేల్చిచేప్పారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) దంపతులు పట్టువస్త్రాలను అందించనున్నారు. ఈరోజు మూడు గంటలకు ఇంద్రకీలాద్రి పైకి చంద్రబాబు, భువనేశ్వరి చేరుకోనున్నారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Hyderabad: చెత్త వేస్తే.. రూ. 1000 ఫైన్‌ కట్టాల్సిందే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 09 , 2024 | 11:20 AM