MLA Rammohan: ఏపీలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయి
ABN , Publish Date - Mar 02 , 2024 | 09:03 PM
నేడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అరాచకాలు, రౌడీయిజం పెరిగిపోయాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(MLA Gadde Rammohan) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం కోసం, రాక్షస పాలనను తరిమి కొట్టడానికే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు పొత్తులతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.
విజయవాడ: నేడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అరాచకాలు, రౌడీయిజం పెరిగిపోయాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(MLA Gadde Rammohan) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రం కోసం, రాక్షస పాలనను తరిమి కొట్టడానికే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు పొత్తులతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసే అర్హత జనసేనకు ఉందన్నారు. పొత్తుల్లో భాగంగా టీడీపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చారని అన్నారు. జనసేన నేతగా అమ్మి శెట్టి వాసు నియోజకవర్గంలో పర్యటించారని తెలిపారు.
ఎవరికీ సీటు వచ్చినా ఒకరి కోసం ఒకరు పనిచేయాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. పొత్తులో సీటు టీడీపీకి వచ్చినా.. త్యాగాలకు సిద్ధమై అమ్మిశెట్టి వాసు పని చేస్తున్నారని అన్నారు. భవిష్యత్‌లో కూడా జనసేన పార్టీ నేతలు సేవలను తప్పకుండా గుర్తు ఉంచుకుంటానని తెలిపారు. తన వంతుగా వారికి అన్ని విధాలా సహకారం అందిస్తానని చెప్పారు. వైసీపీ నేతల అరచకాలను అరికట్టే విధంగా టీడీపీ, జనసేన నేతలు ఐక్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీ వస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు.