Share News

Diarrhea: డయేరియా నేపథ్యంలో జగ్గయ్యపేటలో మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు పర్యటన..

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:14 PM

జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా(diarrhea) విజృంభిస్తోంది. పాత కేసులు తగ్గుతుంటే కొత్త డయేరియా కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు(Municipal RD Naga Narasimha Rao) మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Diarrhea: డయేరియా నేపథ్యంలో జగ్గయ్యపేటలో మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు పర్యటన..

ఎన్టీఆర్: జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా(Diarrhea) విజృంభిస్తోంది. పాత కేసులు తగ్గుతుంటే కొత్త డయేరియా కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు(Municipal RD Naga Narasimha Rao) మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నా పారిశుద్ధ్య నిర్వహణ లోపంపై అధికారుల తీరుపై మండిపడ్డారు. ముక్త్యాల, రావిరాల గ్రామాల్లో కొత్తగా కేసులు నమోదు కావడంపై ఆయన ఆరా తీశారు. ఒకవైపు తగ్గుతున్నా మరోవైపు కొత్త కేసులు నమోదు కావడంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో డయేరియా ప్రబలిన ప్రాంతాలను ఆర్డీ నాగ నరసింహారావు పరిశీలించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణ మెరుగుపరచాలని ఆదేశించారు. మున్సిపాలిటీ సరఫరా చేసే తాగునీరులో క్లోరిన్ శాతాన్ని ఆయన పరీక్షించారు. నాగ నరసింహారావు ఆదేశాల మేరకు డయేరియా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తహసీల్దార్, సిబ్బంది పర్యటించారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుహాసినీ, డీసీహెచ్‌ఎస్‌ బీసీకే నాయక్‌, డీపీఎంవో డాక్టర్‌ నవీన్‌, డాక్టర్లు నియోజవర్గంలోనే ఉంటూ వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 79కేసులు నమోదు కావడం పలువురు మృతిచెందడం, వరసగా కొత్త కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం పెద్దఎత్తున చర్యలు చేపట్టారు.

Updated Date - Jun 25 , 2024 | 03:14 PM