TG Highcourt: వివేకా కేసులో ఉదయ్‌కు బెయిల్ మంజూరు
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:54 AM
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అరెస్ట్ అయిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో A6 నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
అమరావతి, ఆగస్టు 21: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former Minister YS Vivekananda Reddy) కేసులో అరెస్ట్ అయిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో (Telangana High Court) విచారణకు వచ్చింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో A6 నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీవారం పులివెందుల పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలిని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
Tadipatri: ఏబీఎన్ జర్నలిస్టును కాల్చేస్తానన్న వైసీపీ నేత.. పోలీసులు ఏం చేశారో తెలుసా?
గత విచారణలో (ఆగస్టు 14) నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి.. సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరింపులకు సైతం పాల్పడ్డాడని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అదీకాక ఇదే హత్య కేసులో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని సునీత తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఇటువంటి పరిస్థితుల్లో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టను వైఎస్ సునీతతోపాటు సీబీఐ అభ్యర్థించింది. అలాగే ఉదయ్ కుమార్ పిటిషన్‌లో వైఎస్ సునీత రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. ఈ బెయిల్ పిటిషన్‌పై ఇరు వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇక ఈ కేసులో నిందితులు A-6 ఉదయ్ కుమార్ రెడ్డికి, A-7 భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కోర్టు దృష్టికి సీబీఐ తరుపు న్యాయవాది తీసుకు వెళ్లారు. ఇప్పటికే పిటిషనర్ మూడు సార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తే.. న్యాయస్థానం మూడుసార్లు తిరస్కరించిందని సీబీఐ న్యాయవాది ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈరోజు విచారణలో ఉదయ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కాగా.. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని గత ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రికి ఎదురుగా జగన్ క్యాంపు కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు.. ఉదయ్‌ను కడప సెంట్రల్ జైలులోని అతిథిగృహానికి తీసుకెళ్లి.. ఆయన, తండ్రి న్యాయవాది సమక్షంలో అరెస్ట్ చేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. హత్యకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయడంలో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ పేర్కొంది.
AP News: శ్రీశైలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
అయితే... వివేకాను 2019 మార్చి 15న తెల్లవారుజామున 1.30 నుంచి 3 గంటల మధ్య నిందితులు హత్య చేశారు. దేవిరెడ్డి శివశంక ర్‌రెడ్డి ఆదేశాల మేరకు వివేకా మృతదేహానికి కట్లు కట్టడానికి వైద్యులను, సిబ్బందిని తీసుకురావడం, బ్యాండేజీలు తీసుకురావడం, ఫ్రీజర్‌బాక్సు, అంబులెన్స్ ఏర్పాటులో ఉదయ్‌కుమార్‌రెడ్డి కీలక పాత్ర పోషించాడని సీబీఐ చెబుతోంది. ఈయన తండ్రి జయప్రకాశ్‌రెడ్డి.. ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండరు. వివేకా తలకు ఉన్న గొడ్డలిపోట్లకు జయప్రకాశ్‌రెడ్డిని పిలిపించే కుట్లు, బ్యాండేజీ వేయించారని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. అంతేగాక.. వివేకా హత్య జరిగిన రోజు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఏ-5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో కలిసి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా ఆధారాలు సేకరించింది. వివేకా హత్య గురించి 2009 మార్చి 15న ఉదయం 6.26 గంటలకు బయటి ప్రపంచానికి తెలిసింది. అయితే ఉదయ్‌కుమార్‌రెడ్డి 6.25 గంటలకే అవినాశ్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని.. తర్వాత 6.29 గంటల నుంచి 6.31 గంటల వరకు వివేకా ఇంట్లో కూడా ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ నిర్ధారణకు వచ్చింది.
ఇవి కూడా చదవండి...
Kolluravindra: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
Narendra Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. పోలాండ్, ఉక్రెయిన్‌లో మూడు రోజుల పర్యటన!
Read Latest AP News And Telugu News