Share News

Arrest: ఐదుగురు సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:14 AM

మధ్యరాత్రి నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా వెళుతున్న ప్రజల నుంచి సెల్‌ఫోన్లను(Cell phones) కాజేస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Arrest: ఐదుగురు సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

హైదరాబాద్: మధ్యరాత్రి నిర్మానుష్య ప్రదేశంలో ఒంటరిగా వెళుతున్న ప్రజల నుంచి సెల్‌ఫోన్లను(Cell phones) కాజేస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్‌ రాణిగంజ్‌కు చెందిన మహ్మద్‌ మస్తాన్‌(22) సికింద్రాబాద్‌(Secunderabad)కు చెందిన మహ్మద్‌ యాకుబ్‌ (23)లు కలిసి నేరాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బుతో సులువుగా డబ్బు సంపాదించి జల్సాలకు అలవాటుపడ్డారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, సంగీత్‌ చౌరస్తా, ముఖ్యమైన కూడళ్ల వద్ద మధ్యరాత్రి సమయంలో ఒంటరిగా డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఒంటరిగా ఉండడం చూసి వీళ్ల వద్దకు వెళ్లి సెల్‌ఫోన్‌లను లాక్కొని పారిపోతున్నారు.

ఇదికూడా చదవండి: CM Revanth Reddy: 23న కోకాపేటకు సీఎం రేవంత్‌రెడ్డి రాక


నిత్యం ప్రజల నుంచి వరుస ఫిర్యాదులు రావడంతో సికింద్రాబాద్‌లో మాటు వేసిన గోపాలపురం క్రైమ్‌ కానిస్టేబుళ్లు(Gopalapuram Crime Constables) నిందితులను ఎట్టకేలకు పట్టుకోగలిగారు. నిందితుల్లో మస్తాన్‌ టెంట్‌ హౌజ్‌లో పనిచేస్తూ గంజాయి విక్రయించేవాడు. నిందితుల్లో యాకుబ్‌ అనే వ్యక్తి హత్య కేసులు, చిన్న చిన్న కేసులు నేరాల్లో నిందితుల్లో ఉన్నారని విచారణలో వెల్లడైంది, సికింద్రాబాద్‌లో చోరీలకు పాల్పడిన సెల్‌ఫోన్లను ముషీరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మస్తాన్‌కు తక్కువ ధరలకు విక్రయించేవారని పోలీసులు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.


తుకారాంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో...

ఒంటరిగా కనిపించిన వ్యక్తుల నుంచి సెల్‌ఫోన్లను ఎత్తుకెళుతున్న ఇద్దరు నిందితులను తుకారాంగేట్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సీఐ శంకర్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన మాసమల్ల ప్రవీణ్‌ కుమార్‌ (25), కర్నాకటకు చెందిన హుగర్‌ బసవరాజు (55), ఇద్దరు సికింద్రాబాద్‌లో పరిచయమై స్నేహితులయ్యారు. తుకారాంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధ్యరాత్రి సమయంలో ఇద్దరూ కలిసి తిరుగుతూ ఒంటరిగా సెల్‌ఫోన్‌ మాట్లాడుకుంటూ వెళుతున్న వ్యక్తుల్ని నుంచి సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లేవారు.


అనేక వరుస ఫిర్యాదులు రావడంతో తుకారాంగేట్‌ క్రైమ్‌ కానిస్టేబుళ్లు ఈ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో ఇద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తే తుకారాంగేట్‌, గోపాలపురం, మారేడుపల్లి, కుషాయిగూడ, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో సెల్‌ఫోన్‌లను చోరీ చేసిన ఘటనలో అరెస్టు అయ్యారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 21 , 2024 | 11:14 AM