Share News

Rain Alert: భారీ వర్షానికి పొంగిన విజయవాడ పెద్దవాగు..

ABN , Publish Date - Sep 25 , 2024 | 07:35 AM

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు.. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమైన పత్రాలు, విద్యార్థుల సర్టిఫికెట్‌లు , ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు కోల్పోయిన వారికి నకళ్లు జారికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Rain Alert: భారీ వర్షానికి పొంగిన విజయవాడ పెద్దవాగు..

అమరావతి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) విజయవాడ రూరల్ వికాస్ కాలేజీ (Vikas College) వద్ద పెద్దవాగు (Peddawagu) పొంగి పొర్లుతోంది. దీంతో జగనన్న కాలనీ (Jagananna Colony) వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు ముంపు ప్రాంతంలో జగన్న కాలనీ కట్టారని స్థానికులు ఆరోపిస్తు్న్నారు. మరోవైపు పెద్దవాగు కారణంగా నున్న వికాస్ కాలేజీకి రాకపోకలు బంద్ అయ్యాయి. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు.


ముఖ్యమైన పత్రాలు కోల్పోయిన వారికి నకళ్లు జారీ..

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు.. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమైన పత్రాలు, విద్యార్థుల సర్టిఫికెట్‌లు , ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు కోల్పోయిన వారికి నకళ్లు జారికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఉచితంగా ముఖ్యమైన పత్రాలకు నకళ్ళు, డూప్లికేట్‌లను ఉచితంగా జారీ చేయాలని నిర్ణయిస్తూ.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ధ్రువపత్రాలు, డాక్యుమెంట్స్ నకళ్ళు జారీకి ఆయా ప్రభుత్వ శాఖలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. జీవో జారీ చేసిన మరుసటి రోజు నుంచే వారం రోజులు పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.


కాగా ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలో కుండ పోతగా వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే నూజివీడు నియెజకవర్గం పరిధిలోని ఆగిరిపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షాలకు కుంపిని వాగు పొంగి పోతవరప్పాడు గ్రామం వద్ద రోడ్డుపైకి నీరు చేరింది. దీంతో అర్థరాత్రి ఒక గంటపాటు పాటు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మంత్రి పార్థసారథి వరద పరిస్థితిపై పోలీస్ , రెవిన్యూ అధికారులతో అర్థరాత్రి సమీక్ష జరిపారు.


కాగా గత నెలలోవిజయవాడలో కుండపోతగా వర్షాలు కురిసాయి. భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్యం అందించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రొక్లెయిన్ సాయంతో కొండ రాళ్లను పోలీసులు తొలగించారు.

మరోవైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా చోట్ల పరిస్థితులపై అధికారులతో సీఎం మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. మ్యాన్‌హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలన్నారు. అన్ని శాఖలు అలెర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘జే గ్యాంగ్‌’ ఆట కట్టు!

ఆ పాపం బోర్డుదే!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 25 , 2024 | 07:35 AM