CM Chandrababu: అమరావతి రాజధానిపై నేడు శ్వేతపత్రం విడుదల
ABN , Publish Date - Jul 03 , 2024 | 09:26 AM
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయానికి వెళ్లనున్నారు.11.30 గంటల నుంచి సీజనల్ కండిషన్స్, హెల్త్, ఖరీఫ్ ప్రిపరేషన్‌పై ఆయన ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతారు. 3.00 గంటలకు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేస్తారు. సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళతారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయానికి వెళ్లనున్నారు.11.30 గంటల నుంచి సీజనల్ కండిషన్స్, హెల్త్, ఖరీఫ్ ప్రిపరేషన్‌పై ఆయన ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు (Reviews) జరుపుతారు. 3.00 గంటలకు అమరావతి (Amaravati) రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేస్తారు. సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీ (Delhi) బయలుదేరి వెళతారు.
కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హస్తినకు వెళ్తుండడంతో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు.
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీయే నాయకులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. గత ఐదేళ్లలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద చంద్రబాబు ప్రస్తావించనున్నారు.
కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టడంపై సీఎం చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. గత ప్రభుత్వ పాలన వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర పురోగతి కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని అంశాలపై ఆయన ఫోకస్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఎవరంటే..
జగన్ ను "ఛీ" కొడుతున్నది వీళ్లేనా ?
పెండింగ్ బిల్లులపై లెక్కలు రెడీ చేయండి..!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News