AP Politics: విఫల విపక్ష నేత.. ఆ నిర్ణయంతో జగన్ పరువు పోగొట్టుకున్నారా..!
ABN , Publish Date - Jun 23 , 2024 | 01:58 PM
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి పది రోజులు గడుస్తోంది. అలాగే 16వ శాసనసభకు ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తైంది. 16వ శాసనసభ తొలిసమావేశాలు రెండు రోజులపాటు జరిగాయి.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి పది రోజులు గడుస్తోంది. అలాగే 16వ శాసనసభకు ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తైంది. 16వ శాసనసభ తొలిసమావేశాలు రెండు రోజులపాటు జరిగాయి. మొదటి రోజు సభకు హాజరైన వైసీపీ సభ్యులు.. ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసి వెళ్లిపోయారు. రెండోరోజు స్పీకర్ ఎన్నికకు వైసీపీ సభ్యులు హాజరుకాలేదు. దీంతో జగన్ నిర్ణయంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ శ్రేణులు, ఆ పార్టీని అభిమానించే కొందరు మేధావులు సైతం వైసీపీ అధినేత జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది.
AP Politics: బయటపడుతున్న వైసీపీ దాష్టికాలు, దారుణాలు..
ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11 నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఈ తీర్పు వైసీపీని తీవ్ర నిరాశకు గురిచేసింది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోయినప్పటికీ.. ఎన్డీయే కూటమి పక్షాల తర్వాత అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న విపక్ష పార్టీ వైసీపీ మాత్రమే. దీంతో సంఖ్యతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యతను ప్రజలు వైసీపీకి మాత్రమే అప్పగించారు. కానీ ఆ పార్టీ అధినేత జగన్ ఆలోచనతో ప్రజలు షాక్‌కు గురవుతున్నారట.
YCP: వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతతో వెలుగులోకి సంచలన విషయాలు..
స్పీకర్ ఎన్నికకు దూరంగా..
అసెంబ్లీ సమావేశాల రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. వాస్తవానికి స్పీకర్ ఎన్నిక సందర్భంగా శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల సభ్యులు హాజరై.. స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తికి శుభాకాంక్షలు తెలపడం సభా సంప్రదాయంగా వస్తోంది. 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పటికీ అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు హాజరయ్యారు. రెండేళ్ల పాటు చంద్రబాబు సభకు హాజరవుతూ ప్రజల గొంతుకుగా ప్రశ్నించారు. అధికారపక్షంలో ఉన్న వైసీపీ ఎంతగా అవమానించినా చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష పార్టీ బాధ్యతను నిర్వర్తించారు. చివరకు వ్యక్తిగతంగా లక్ష్యంగా చేయడంతో సీఎంగా సభలో అడుగుపెడతానంటూ సవాలు చేసి బయటకు వచ్చారు. అంతేకానీ శాసనసభ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించలేదు. కానీ స్పీకర్ ఎన్నికకు దూరంగా ఉండటం ద్వారా శాసనసభ గౌరవాన్ని వైసీపీ తగ్గించే ప్రయత్నం చేసిందని.. తొలివిడత అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ విపక్ష నేతగా విఫలమయ్యారనే ప్రచారం జరుగుతోంది.
AP News: పులివెందుల ఎమ్మెల్యే జగన్‌పై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం
జగన్ తన సొంత నియోజకవర్గానికి వెళ్లిన నేపథ్యంలో కనీసం మిగతా ఎమ్మెల్యేలను సభకు పంపించి ఉండాల్సిందని.. శాసనసభకు హాజరుకాకుండా జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. రానున్న అసెంబ్లీ సమావేశాలకైనా వైసీపీ సభ్యులు హాజరవుతారా.. లేదా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
AP News: నెల్లూరులో మరో రాజప్రసాదం నిర్మించిన జగన్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News