Share News

Srisailam: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ఎప్పటినుంచంటే..

ABN , Publish Date - Oct 22 , 2024 | 10:26 AM

Andhrapradesh: శని, ఆది, సోమవారం కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్వామివారి స్పర్శ దర్శనం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో తెలిపారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Srisailam: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ఎప్పటినుంచంటే..
Srisailam Temple

నంద్యాల, అక్టోబర్ 22: నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం దేవీనవరాత్రులు అంగరంగవైభవంగా ముగిశాయి. ఇప్పుడు కార్తీక మాసోత్సవాలకు శ్రీశైలం క్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీశైలంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఈవో చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. కార్తీకమాసమంతా శ్రీశైలంలో గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశామని వెల్లడించారు.

Sharmila : జగన్‌ నీకు సిగ్గులేదా?


శని, ఆది, సోమవారం కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్వామివారి స్పర్శ దర్శనం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన, పూజలు తాత్కాలికంగా నిలుపుదల చేసి.. అమ్మవారి ఆశీర్వచన మండపంలో కొనసాగింపు ఉంటుందన్నారు. కార్తీక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. నవంబర్ 15న కార్తీక పౌర్ణమి కావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం కార్యక్రమం ఉంటుందని ఈవో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.


వైభవంగా ఉత్సవాలు..

మరోవైపు ఇటీవల శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దసరాశరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రతీరోజు ఒక్కో రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలను దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఉత్సవాలలో స్వామి, అమ్మవార్లకు విశేష అర్చనలు, రుద్రయాగం, చండీయాగం, జపపారాయణలు, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహించారు. ఉత్సవాల్లో నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో సుందరీకరించారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు ప్రధాన ఆలయానికి ముందుభాగాన ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

బంగారం, వెండి ఆల్‌టైం రికార్డు


శ్రీశైలం గేట్లు ఎత్తివేత

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 4 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 1,60,146 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,77,040 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. దాంతో పాటు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 210.9946 టీఎంసీలుగా కొనసాగుతోంది. అటు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

బంగారం, వెండి ఆల్‌టైం రికార్డు

TG Ministers: సియోల్‌లో టీ.మంత్రులు బిజీబిజీ.. నేడు ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 10:57 AM