Nagula chavithi: విజయవాడలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
ABN , Publish Date - Nov 05 , 2024 | 10:10 AM
Andhrapradesh: నాగుల చవితి అంటే నాగదేవతలను ఆరాధించే పండుగ. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాలుగవ రోజు అంటే చతుర్థినాడు నాగుల చవితిని జరుపుకుంటారు హిందువులు. కార్తీక మాసంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి ప్రధాన పండుగ. అలాగే కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు.
విజయవాడ, నవంబర్ 5: నగరంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చోడవరం నాగేంద్ర స్వామిదేవాలయం, అయ్యప్ప నగర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకాలు చేస్తున్నారు. నాగుల చవితి సందర్భంగా దేవాలయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలు పోస్తుంటారు.
నాగుల చవితి విశిష్టత
నాగుల చవితి అంటే నాగదేవతలను ఆరాధించే పండుగ. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాలుగవ రోజు అంటే చతుర్థినాడు నాగుల చవితిని జరుపుకుంటారు హిందువులు. కార్తీక మాసంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి ప్రధాన పండుగ. అలాగే కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతమంది ఇంట్లో నాగదేవత విగ్రహం పెట్టి పూజలు చేస్తారు. కానీ కొన్ని ప్రదేశాలలో భక్తులు పాము పుట్ట వద్దకు వెళ్లి నైవేద్యం సమర్పించి ఇతర పూజలు చేసి పాలు పోస్తారు. నాగుల చవితి సందర్భంగా మహిళలు ఉపవాసం ఉండి నాగపూజను చేస్తారు. అలాగే ఆలయాల్లోని పుట్ట వద్దకు పాలు పోసి, నైవేద్యం సమర్పిస్తారు. తమ సంతానాన్ని క్షేమంగా ఉండాలని మహిళలు నాగపూజను ఆచరిస్తారు. పాలు, కుంకుడు, పసుపు, విభూతి, బెల్లం, నల్ల నువ్వుల మిశ్రమంతో చేసిన తీపి పదార్ధాలతో పాలు బెల్లం, తెల్ల నువ్వులు, ఉడకబెట్టని మిశ్రమంతో తయారు చేసి పుట్టల వద్ద నైవేద్యంగా ఉంచుతారు. అలాగే కొంతమంది గుడ్లను కూడా పుట్ట వద్ద ఉంచుతారు. నాగదేవత పుట్టపై పసుపు, కుంకుమ్మ వేసి పూలు పెడతారు. దీపం వెలిగించి తమతో తెచ్చుకున్న నైవేద్యాన్ని పుట్ట వద్ద ఉంచుతారు. పూజ అనంతరం కొంచెం పుట్ట మన్ను ను తీసుకుని వెళ్తారు మహిళలు. నాగుల చవితి, నాగుల పంచమి రోజు నాగేంద్రుడిని ఆరాధిస్తే సకల రోగాలు తొలగిపోయి ఆరోగ్యంవంతులం అవుతారమని భక్తుల విశ్వాసం.
పూజా సమయం
అలాగే నాగుల చవిత నాడు ఏ సమయంలో పుట్టకు పాలు పోయాలి, చవితి ఘడియలు ఎప్పుడు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చవితి ఘడియలు నిన్న (నవంబర్ 4) రాత్రి 8:53 గంటల నుంచి ప్రారంభమై ఈరోజు (మంగళవారం) రాత్రి 9:25 గంటలకు ముగియనున్నాయి. అంటే ఈరోజు మొత్తం కూడా చవిత ఘడియలు ఉన్న నేపథ్యంలో మంగళవారం నాడు నాగుల చవితిని జరుపుకోవాలి. ఈరోజు ఉదయం 8:21 గంటల నుంచి 9:16 గంటల వరకు పుట్టలో పాలు పోయవచ్చని.. వర్జ్యం, దుర్ముహూర్తాలు లేకుండా పుట్టలో పాలు పోయవచ్చని పురోహితులు చెబుతున్నారు. మరోవైపు తిరుమలలో కూడా చవితి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు దర్శనమివ్వనున్నారు.
ఇవి కూడా చదవండి..
Read Latest AP News And Telugu News