Share News

Nara Lokesh: మెగా డీఎస్సీపై నారా లోకేష్ కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 03 , 2024 | 07:26 AM

విమర్శలకు తావులేకుండా పకడ్బందీగా మెగా డిఎస్సీ అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ ట్విటర్ వేదికగా తెలిపారు. న్యాయపరమైన వివాదాలు లేకుండా ముందుకెళదామన్నారు. పాఠశాలల్లో అకడమిక్ కేలండర్ రూపకల్పనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టెట్, మెగా డీఎస్సీపై సమీక్షలో విద్య, ఐటి మంత్రి లోకేష్ తెలిపారు.

Nara Lokesh: మెగా డీఎస్సీపై నారా లోకేష్ కీలక ప్రకటన

అమరావతి: విమర్శలకు తావులేకుండా పకడ్బందీగా మెగా డిఎస్సీ అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ ట్విటర్ వేదికగా తెలిపారు. న్యాయపరమైన వివాదాలు లేకుండా ముందుకెళదామన్నారు. పాఠశాలల్లో అకడమిక్ కేలండర్ రూపకల్పనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టెట్, మెగా డీఎస్సీపై సమీక్షలో విద్య, ఐటి మంత్రి లోకేష్ తెలిపారు. అంతకు ముందు నారా లోకేష్ అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. ఎలాంటి విమర్శలూ రాకూడదని స్పష్టం చేశారు. టెట్‌, డీఎస్సీల మధ్య ఎక్కువ సమయం కావాలని అభ్యర్థులు అడుగుతున్నారని, దీనిపై అభ్యర్థులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.


టెట్‌ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదనే విషయాన్ని అభ్యర్థులకు స్పష్టం చేయాలని అధికారులకు నారా లోకేష్ సూచించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మెగా డీఎస్సీలో వయోపరిమితి సడలింపులపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విషయంలో లోకేష్ సానుకూల దృక్ఫథంతో ఉన్నారు. వారికి ఈ డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలకు అనుమతుల రెన్యువల్‌లో అనవసర ఆంక్షలు విధించవద్దన్నారు. యువత నైపుణ్యాలను గుర్తించేందుకు స్కిల్‌ సెన్సెస్‌ చేపడుతున్నట్లు మరో సమీక్షలో లోకేశ్‌ చెప్పారు.

Updated Date - Jul 03 , 2024 | 07:26 AM