Deepam Scheme: ఒంగోలులో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన మంత్రి డోలా
ABN , Publish Date - Nov 01 , 2024 | 04:55 PM
Andhrapradesh: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను మంత్రి పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు.
ప్రకాశం, నవంబర్ 1: రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
(Minister Dola Sri Bala Veeranjaneya Swami), ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, కలెక్టర్ తమీమ్ అన్సారియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు.
Rain Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆ ప్రాంతాల్లో దంచికొట్టుడే..
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. దీపం పధకం కింద రాష్ట్రంలో కోటి 43 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. దీని కోసం సబ్సిడీ కింద ప్రకాశం జిల్లాలో మహిళలకు రూ.41 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. సిలిండర్ బుక్ చేసుకున్న 48 గంటల్లో రాయితీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమవుతుందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లపై వైసీపీ దుష్ప్రచారం సిగ్గుచేటని మండిపడ్డారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
కాగా..శ్రీకాకుళం జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్‌ను సీఎం చంద్రబాబు స్వయంగా అందజేశారు. అనంతరం లబ్దిదారుడి వంటింట్లోకి వెళ్లి సీఎం చంద్రబాబు గ్యాస్ స్టవ్ వెలిగించి.. టీ పెట్టారు. మరోవైపు సీఎం చంద్రబాబు తన నివాసానికి వచ్చి స్వయంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా సిలిండర్ అందజేయడం పట్ల లబ్దిదారుడి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
Bandi Sanjay: కేటీఆర్ పాదయాత్రపై బండి సంజయ్ రియాక్షన్
అలాగే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ యస్ జగన్నాధపురంలో దీపం 2 ఉచిత సిలిండర్ల పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. దీపం ఉచిత సిలిండర్లు కోటి ఎనిమిది లక్షల మందికి ఇవ్వబోతున్నామన్నారు. గత ప్రభుత్వం కంటే సంక్షేమ పథకాలు బాగా చేసి చూపిస్తున్నామన్నారు. డబ్బు దోచుకుని, దాచుకునే నేతల్లా మనం చేయడం లేదన్నారు. ఎర్ర కండువా వేసుకుని ఎదురొడ్డి నిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిందని.. ‘‘ఈ విజయం మీది..ఈ కూటమి ప్రభుత్వం మీది’’ అని డిప్యూటీ సీఎం అన్నారు. అంతకుముందు ఐ యస్ జగన్నాధపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న పవన్.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Lokesh: అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేష్
AP Pension: ఏపీలో వేగంగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ
Read latest AP News And Telugu News