Special trains: సంక్రాంతి పండుగకు సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Jan 06 , 2024 | 12:04 PM
సంక్రాంతి పండగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అఽధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అఽధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జనవరి 10న తిరుపతి-సికింద్రాబాద్(Tirupati-Secunderabad) ప్రత్యేక రైలు(07065), సికింద్రాబాద్- కాకినాడ టౌన్ (07066), నర్సాపూర్- సికింద్రాబాద్(07251), 11న కాకినాడటౌన్-సికింద్రాబాద్ (07067), సికింద్రాబాద్-నర్సాపూర్ (07252), 12న సికింద్రాబాద్- కాకినాడ టౌన్(Secunderabad- Kakinada Town) (07250), 13న కాకినాడ టౌన్- తిరుపతి ప్రత్యేక రైలు (07249) నడుస్తుందని పేర్కొన్నారు. 16న కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07253), 17న సికింద్రాబాద్- కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు(07254) నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.