Trains: రాయదుర్గం-బళ్లారి మీదుగా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Dec 18 , 2024 | 11:30 AM
ప్రయాగరాజ్ కుంభమేళా(Prayagraj Kumbh Mela)ను పురస్కరించుకుని జిల్లాలోని రాయదుర్గం, కర్ణాటక(Rayadurgam, Karnataka)లోని బళ్లారి మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
గుంతకల్లు(అనంతపురం): ప్రయాగరాజ్ కుంభమేళా(Prayagraj Kumbh Mela)ను పురస్కరించుకుని జిల్లాలోని రాయదుర్గం, కర్ణాటక(Rayadurgam, Karnataka)లోని బళ్లారి మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. మైసూరు-దానాపూర్(Mysore-Danapur) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (నం. 06207) రైలు జనవరి 18, ఫిబ్రవరి 15, మార్చి 1న (శనివారాలలో) మైసూరులో సాయంత్రం నాలుగున్నరకు బయలుదేరి మూడు రోజుల తర్వాత మంగళవారం ఉదయం 10 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Trains: సూళ్లూరుపేట, నెల్లూరు మెము రైళ్ల వేళల్లో మార్పులు
దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06208) జనవరి 22, ఫిబ్రవరి 19, మార్చి 5న (బుధవారాలలో) దానాపూర్‌లో తెల్లవారుజామున 1-45 గంటలకు బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మైసూరుకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు మాండ్య, మద్దూరు, కెంగెరి, కేఎస్ఆర్ బెంగళూరు(KSR Bangalore), యశ్వంతపూర్, టుముకూరు, అరిసికెరె, చిగ్జాజుజుర్, చిత్రదుర్గ, రాయదుర్గ, బళ్లారి కంటోన్మెంటు, హోస్పేట, కొప్పల్, గదగ్, హుబ్లి,
బాదామి, బాగల్‌కోట్, విజయపుర, షోలాపూర్, కురుద్వాడి, డౌండ్, అహ్మదానగర్, కోపర్‌గావ్, మన్మాడ్, భుస్వాల్, ఖండ్వా, తల్వాడ్యా, చనేర, ఖిర్కియా, హర్డా, బాణాపుర, ఇటార్సి, పిప్రియ, నరసింగ్‌పూర్, జబల్‌పూర్, కట్ని, మైహర్, సట్నా, మానిక్‌పూర్, ప్రయాగరాజ్ చౌకీ, మీర్జాపూర్, చునర్, దీన్‌దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, ఆర స్టేషన్ల మీదుగా వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం
ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి
Read Latest Telangana News and National News