Share News

Vishnukumar Raju: 175 కి 175 గెలుస్తామని అన్నం తిన్న వాళ్లెవరైనా అంటారా?

ABN , Publish Date - Jan 01 , 2024 | 10:46 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలు తర్వాత ఏపీ ప్రజలకు సుఖ సంతోషాలు వస్తాయన్నారుు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలై.. జగన్ ప్రభుత్వం ఇంటికి వెళ్ళడం ఖాయమని.. వైసీపీకి 20 సీట్లు మించిరావంటూ జోస్యం చెప్పారు.

Vishnukumar Raju: 175 కి 175 గెలుస్తామని  అన్నం తిన్న వాళ్లెవరైనా అంటారా?

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (CM Jaganmohan Reddy) బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు (BJP Leader Vishnu Kumar Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలు తర్వాత ఏపీ ప్రజలకు సుఖ సంతోషాలు వస్తాయన్నారుు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలై.. జగన్ ప్రభుత్వం ఇంటికి వెళ్ళడం ఖాయమని.. వైసీపీకి 20 సీట్లు మించిరావంటూ జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అన్నింటి మీద పన్నులు వేసి... చెత్త సీఎంగా జగన్ పేరు తెచ్చుకున్నారన్నారు. దేశంలో అత్యధిక ధనిక సీఎం జగన్ అని వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని చూస్తున్నారని.. ఆ పప్పులు ఉడకవన్నారు. 175 కి 175 గెలుస్తామని అన్నం తిన్న వాళ్ళు ఎవరైనా అంటారా? అని మండిపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలని ప్రజలు కోరుకుంటున్నారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Jan 01 , 2024 | 10:46 AM