Share News

Minister Dola: అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యను పునరుద్ధరిస్తాం

ABN , Publish Date - Aug 19 , 2024 | 01:58 PM

వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ వర్క్ షాప్‌లో గురువారం నాడు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు.

Minister Dola: అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యను పునరుద్ధరిస్తాం
Minister Dola Bala Veeranjaneya Swamy

అమరావతి: వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ వర్క్ షాప్‌లో గురువారం నాడు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అందించడంలో సాంఘిక సంక్షేమ శాఖ పనితీరు కీలకమని చెప్పారు.


ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలి, విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఏ సౌకర్యాలు లేని రోజుల్లోనే కష్టపడి చదివి అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ మహనీయులయ్యారని కొనియాడారు.


ప్రతి హాస్టల్లో అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ ఫొటోలుండాలి, వారి స్ఫూర్తిని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. ఉద్యోగులు కష్టపడి పనిచేసి మెరుగైన ఫలితాలు తీసుకురావాలని అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి హామీ ఇచ్చారు.

Updated Date - Aug 19 , 2024 | 01:58 PM