Karthika Masam: చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట..
ABN , Publish Date - Nov 25 , 2024 | 09:31 AM
పంచారామ క్షేత్రం పాలకొల్లలోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామి వారి మూలవిరాట్‌కు అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు దీపోత్సవాలు చేస్తున్నారు. కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నారు.
అమరావతి: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం (Karthika Masam).. అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం చాలా పవిత్రమైంది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో నెలంతా భక్తులు (Devotees) భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. తెల్లవారుజామునే కార్తీక స్నానమాచరించి.. కార్తీక దీపం వెలిగిస్తారు. కాగా నవంబర్ 2వ తేదీన ప్రారంభమైన కార్తీక మాసం సోమవారం (Monday) (ఈరోజు)తో ముగుస్తుంది. చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
పశ్చిమగోదావరి..
పంచారామ క్షేత్రం పాలకొల్లలోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామి వారి మూలవిరాట్‌కు అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు దీపోత్సవాలు చేస్తున్నారు. కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నారు.
విశాఖపట్నం..
కార్తీక మాసం చివరి నాల్గవ సోమవారం సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. వేకువజామునుంచే శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. సింహాచలం కొండపై స్వయంభుగా వెలసిన త్రిపురాంతక స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. మహిళలు ఆలయాల ముందు కార్తీక దీపాలు వెలిగించి.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
నంద్యాలలో..
కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భక్తజనం పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. గంగాధర మండపం వద్ద, మాడవీధులలో పలుచోట్ల కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కలు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అధికారులు అనుమతి ఇస్తున్నారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా...ద్రాక్షారామం....
కార్తీక మాసం నల్గవ సోమవారం కావడంతో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచి సప్తగోదావరిలో నదిలో పుణ్య స్నాన మాచరించి భక్తులు శ్రీ అమ్మ వారిని శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కాకినాడ జిల్లా..
కార్తీక మాసంతో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయా క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసం నల్గొవ సోమవారం తెల్లవారుజాము నుంచే పాదగయ పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి, పురుహూతిక అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...
బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News