Bhadangi Airport: బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం..
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:59 PM
బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం రాబోతోంది. విజయనగరం జిల్లాలోని బాడంగిలో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత అది నిరుపయోగమైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. అందు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
విజయనగరం జిల్లా: బ్రిటిష్ (British) కాలంనాటి విమానాశ్రయానికి (Airport) పూర్వ వైభవం (Former glory) రాబోతోంది. భారత రక్షణ రంగానికి చెందిన ఆయుధ సంపత్తి భద్రపరచడానికి అనువైన ప్రదేశంగా మారబోతోంది. ఇప్పుడు ఉన్న స్థలానికి అదనంగా 17 వందల ఎకరాలు సేకరించాలని కూడా నిర్ణయమైంది. రైతుల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం రావడం లేదు. తమకు తగిన విధంగా పరిహారం అందిస్తే చాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్
విజయనగరం జిల్లా (Vizianagaram Dist.,)లోని బాడంగి (Bhadangi)లో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. నేవీకి సంబంధించిన ఎయిర్ స్ట్రిప్ (మినీ విమానాశ్రయం)ను రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. అప్పట్లో ఆయుధ కేంద్రంగా ఉన్న బాడంగి విమానాశ్రయం 227 ఎకరాల పరిధిలో ఉండేది. తర్వాత అది నిరుపయోగమైంది. అప్పట్లో ఇక్కడ ఉండే గోడౌన్లు కాలక్రమేన ధ్వంసం కాగా విమానాలు దిగి రన్‌వే మాత్రం మిగిలే ఉంది. కొంత ఆక్రమణలకు గురైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. ఆయుధాలు భద్రపరిచే గోడౌన్లు, బంకర్లను శత్రుదేశాలు గుర్తించకుండా ఉండేందుకు ఇది అణువైన ప్రదేశంగా నేవీ అధికారులు నివేదికలో రూపొందించారు. విశాఖపట్నానికి చేరువగా ఉన్న ఈ ప్రదేశంలో భారత రక్షణరంగ ఆయుధాగారాన్ని ఏర్పాటు చేయడమే శ్రేయష్కారమని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఫైటర్ జెట్ల ఫైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు కూడా బాడంగి విమానాశ్రయం ఉపయోగపడుతుందని నేవీ అధికారులు అంచనా వేసుకుంటున్నారు. దీనిపై స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ లెక్కల్లో ముందే ఉన్న 227 ఎకరాలకు అదనంగా మరో 17 వందల ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు యోచిస్తున్నారు. బాడంగి మండలంలోని మల్లంపేట, ఉడివలస, ముగడ, రామచంద్రాపురం, కోడూరు గ్రామల పరిధిలోని భూములు సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. భూములిచ్చేందుకు సిద్ధమైన రైతులు తమకు తగిన రీతిలో పరిహారం అందించడంతోపాటు తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. నేవీ అధికారులు ఈ ప్రాంతానికి తరచూ వస్తూ వెళుతున్నారు. దాంతో బాడంగి విమానాశ్రయ పునరుద్ధరణపై త్వరలో ఒక స్పష్టత వస్తుందని ఎదురు చూస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భూ సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ దోపిడి..
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన..
సంక్షేమం..అభివృద్ధి .. ఏపీకి మహర్దశ
ABN Live..: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News