Bank Holidays In March 2024: మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే.. లిస్ట్ చూడండి.
ABN , Publish Date - Mar 01 , 2024 | 11:01 AM
మార్చి నెలలో 14 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఈ నెలలో 31 రోజులు ఉండగా, మిగిలిన 17 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారం, 5 ఆదివారాలు, పండగలు వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పండగలను బట్టి 14 రోజులు బ్యాంకులు పనిచేయవు.
ఏబీఎన్ ఇంటర్నెట్: మార్చి నెలలో 14 రోజులు బ్యాంకులు (Banks) మూసి ఉంటాయి. ఈ నెలలో 31 రోజులు ఉండగా, మిగిలిన 17 రోజులు మాత్రమే బ్యాంకులు (Banks) పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారం, 5 ఆదివారాలు, పండగలు వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పండగలను బట్టి 14 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ లిస్ట్ చుద్దాం. పదండి.
మార్చి 1వ తేదీన చాప్చర్ కట్ పండగ ఉంది. ఈ రోజు మిజోరంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మార్చి 8వ తేదీ మహా శివరాత్రి పర్వదినం. త్రిపుర, మిజోరం, తమిళనాడు, సిక్కిం, అసోం, మణిపూర్, ఇటానగర్, రాజస్థాన్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, గోవా, బీహర్, మేఘలయాలో తప్ప మిగిలిన చోట్ల బ్యాంకులు పనిచేస్తాయి.
మార్చి 25వ తేదీ హోలీ పండుగ సందర్భంగా కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహర్, శ్రీనగర్ తప్ప మిగిలిన చోట్ల బ్యాంకులు పనిచేస్తాయి.
మార్చి 29వ తేదీ గుడ్ ప్రైడే. త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తప్ప మిగిలిన చోట్ల బ్యాంకులు పనిచేస్తాయి.
స్టేట్ హాలీడేస్
మార్చి 22వ తేదీ బీహార్ దివాస్
మార్చి 26వ తేదీన యోసంగ్ డే (ఒడిశా, మణిపూర్, బీహర్)
మార్చి 27వ తేదీ బీహర్‌లో హోలి
మార్చి 9వ తేదీ రెండో శనివారం, 23వ తేదీ నాలుగో శనివారం
మార్చి 3, 10, 17, 24, 31 తేదీలు ఆదివారం వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.