Share News

Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో

ABN , Publish Date - Dec 18 , 2024 | 05:36 PM

చిన్న పిల్లలు చిన్న చిన్నగా పొదుపు చేయడం ఎప్పుడైనా చుశారా. లేదా అయితే ఈ వీడియో చూసేయండి మరి. ఈ వీడియో చూసిన పలువురు మాత్రం షాక్ అవుతున్నారు. అయితే ఎందుకనేది మాత్రం తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో
Choti choti savings

ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక విధంగా పొదుపు చేయాలని నిపుణులు చెబుతుంటారు. కొంతమంది తమ ఎఫ్‌డీ ఖాతాలో జమ చేసుకుంటే, మరికొందరు మాత్రం ఇంట్లోనే డబ్బును (Choti Choti Savings) దాచుకుంటారు. ఆ క్రమంలో పొదుపు చేయాలనే అలవాటును పిల్లలకు కూడా నేర్పుతుంటారు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న బాక్సులు లేదా కుండల మాదిరిగా ఉన్న పిగ్గీ బ్యాంకులను ఏర్పాటు చేసుకుని సేవ్ చేస్తుంటారు. ఆ విధంగా ఓ చిన్నారి తనకు ఇచ్చిన డబ్బును తన పిగ్గీ బ్యాంకుల్లో ప్రతిసారి దాచుకుంది. ఆ విధంగా ఏడాదిన్నర సమయంలో చిన్నారి చాలా డబ్బులు దాచుకుంది.


చిన్న పొదుపు ఎంత ఉందంటే..

కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బు మొత్తం ఎంత అయ్యిందోనని చూసేందుకు ఇటివల తన తల్లి పిగ్గీ బ్యాంకులను పగులగొట్టి బయటకు చూపించింది. చిన్న చిన్న పొదుపు అంటూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొంత మంది మాత్రం వీడియో చూసి చిన్న పొదుపులా అంటూ ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ తన కుమార్తెతో ఇంట్లో కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఆమె ముందు మూడు పిగ్గీ బ్యాంకులు కనిపిస్తున్నాయి.


కామెంట్లు..

చిన్నారి పొదుపుతో మూడు పిగ్గీ బ్యాంకులను నింపినట్లు ఆ మహిళ తెలిపింది. ఆ క్రమంలో తాము 1.5 ఏళ్లుగా ఆ డబ్బును పొదుపు చేస్తున్నామని మహిళ వెల్లడించింది. ఆ తరువాత ఆమె వాటిని ఒక్కొక్కటిగా పగులగొట్టింది. ఆ క్రమంలో వాటిలో దాచుకున్న నోట్లన్నీ రూ. 500 మాత్రమే ఉండటం విశేషం. అంటే రూ.500 నోట్లను మాత్రమే పిగ్గీ బ్యాంకులో సేవ్ చేశారు. ఆ డబ్బును చూసిన పలువురు అది చిన్న పొదుపు కాదని, పెద్ద పొదుపు అని కామెంట్లు చేస్తున్నారు.


చిన్నారి పొదుపు..

మరొక వ్యక్తి వాటిలో రూ. 500 కంటే తక్కువ నోటు ఒక్కటి కూడా లేదన్నారు. ఇక అది చిన్న పొదుపు ఎలా అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరొక వినియోగదారుడు చిన్నారి పొదుపును ప్రోత్సహించి చాలా మంచిపని చేశారని అంటున్నారు. అంతేకాదు ఆ మొత్తాన్ని దేని కోసం వినియోగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ మొత్తం ఎంత వచ్చిందని ఇంకో వ్యక్తి ఆసక్తితో ఆడిగారు. అయితే ఆ మొత్తం డబ్బు 12.7 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

Viral News: రూ.10 వాటర్ బాటిల్‌ రూ.100.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్


Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..


Narayana Murthy: 70 గంటల పని విధానాన్ని మళ్లీ ప్రస్తావించిన నారాయణమూర్తి.. ఈసారి ఏం చెప్పారంటే..


Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 18 , 2024 | 05:37 PM