SpiceJet: స్పైస్‌జెట్ ఎండీ సహా పలువురిపై ఢిల్లీ పోలీసుల కేసు
ABN , Publish Date - Oct 05 , 2024 | 04:36 PM
స్పైస్‌జెట్ ఆర్థిక సమస్యలు క్రమంగా ముదురుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) స్పైస్‌జెట్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ సహా ఇతర ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
సంక్షోభంలో ఉన్న స్పైస్‌జెట్(SpiceJet) సంస్థకు మళ్లీ చిక్కులు మొదలయ్యాయి. ప్రావిడెంట్ ఫండ్ (PF)కి సంబంధించిన 10 నెలల బకాయిలను కంపెనీ తాజాగా చెల్లించింది. మిగతా బకాయిల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) స్పైస్‌జెట్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులపై రూ. 65.7 కోట్ల భవిష్య నిధి (PF) విషయంలో కేసు నమోదు చేశారు. అజయ్ సింగ్, శివాని సింగ్ (డైరెక్టర్), అనురాగ్ భార్గవ (స్వతంత్ర డైరెక్టర్), అజయ్ చోటాలాల్ అగర్వాల్, మనోజ్ కుమార్‌లపై కేసు ఫైల్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో ఉద్యోగుల వాటాగా కార్మికుల జీతాల నుంచి తొలగించిన మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ కోసం పంపలేదని పేర్కొన్నారు.
సకాలంలో
రూ. 65.7 కోట్లకుపైగా డిపాజిట్ చేయడంలో సంస్థ విఫలమైందని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా స్పైస్‌జెట్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్, మరికొందరు ఉన్నతాధికారులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీ తమ ఉద్యోగుల PF విరాళాలకు ట్రస్టీలుగా వ్యవహరిస్తారని, ఆ నిధులను సకాలంలో EPFOకి సమర్పించాలని FIR ప్రస్తావించింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 4న స్పైస్‌జెట్ 10 నెలల విలువైన పీఎఫ్ బకాయిలను డిపాజిట్ చేసినట్లు ప్రకటించింది. అయితే పీఎఫ్ నిధులు చెల్లించిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
జీతాల బకాయి
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP) ద్వారా రూ. 3,000 కోట్లను సేకరించిన తర్వాత పెండింగ్‌లో ఉన్న అన్ని వస్తు సేవల పన్ను (GST) బాధ్యతలు, జీతాల బకాయిలను పరిష్కరించినట్లు ఎయిర్‌లైన్ పేర్కొంది. ఫిర్యాదు ప్రకారం 10,000 మందికి పైగా కార్మికులను కలిగి ఉన్న స్పైస్‌జెట్ జూన్ 2022 నుంచి జూలై 2024 మధ్య ఉద్యోగుల జీతాలలో 12 శాతాన్ని PF కోసం తగ్గించారు. అయితే అవసరమైన 15 రోజుల గడువులోగా ఆ మొత్తాన్ని ఉద్యోగుల PF ఖాతాలకు బదిలీ చేయలేదు.
నష్టాల్లోకి షేర్లు
QIP ద్వారా తాజా నిధులను సేకరించిన మొదటి వారంలోనే స్పైస్‌జెట్ బకాయి ఉన్న జీతం, GST బకాయిలను క్లియర్ చేసిందన్నారు. పది నెలల విలువైన PF బకాయిలను డిపాజిట్ చేయడం ద్వారా గణనీయమైన పురోగతిని సాధించినట్లు చెప్పారు. స్పైస్‌జెట్ ఆర్థిక సమస్యలు, చట్టపరమైన సమస్యలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఫ్లీట్‌లో విమానాల సంఖ్యను కూడా తగ్గించింది. ఈ కారణంగా శుక్రవారం బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేర్లు 4.25 శాతం నష్టంతో రూ.62.79 వద్ద ముగిశాయి.
ఇవి కూడా చదవండి:
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More Business News and Latest Telugu News