Share News

Gautam Adani: గౌతమ్ అదానీ జీతం ఎంతో తెలుసా.. ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్ కంటే..

ABN , Publish Date - Jun 23 , 2024 | 01:29 PM

భారతదేశంలో రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ(Gautam Adani) వేతనం(salary) ఎంతో తెలుసా. తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదానీ రూ. 9.26 కోట్ల మొత్తాన్ని వేతనంగా తీసుకున్నారు. ఇది ఇతర ప్రత్యర్థి వ్యాపారవేత్తల కంటే చాలా తక్కువ కావడం విశేషం.

Gautam Adani: గౌతమ్ అదానీ జీతం ఎంతో తెలుసా.. ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్ కంటే..
Gautam Adani salary

భారతదేశంలో రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ(Gautam Adani) వేతనం(salary) ఎంతో తెలుసా. తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదానీ రూ. 9.26 కోట్ల మొత్తాన్ని వేతనంగా తీసుకున్నారు. ఇది ఇతర ప్రత్యర్థి వ్యాపారవేత్తల కంటే చాలా తక్కువ కావడం విశేషం. దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కోవిడ్-19 నుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. అయితే అంతకుముందు ఆయన జీతం సంవత్సరానికి రూ.15 కోట్లుగా ఉంది.

ఎయిర్ టెల్ సంస్థ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్(Sunil Mittal) 2022-23లో రూ. 16.7 కోట్లు అందుకున్నారు. బజాజ్ ఆటో సీఈఓ రాజీవ్ బజాజ్(rajiv bajaj) రూ. 53.7 కోట్లు తీసుకున్నారు. హీరో మోటోకార్ప్ బోర్డు డైరెక్టర్ పవన్ ముంజాల్ రూ. 80 కోట్లు అందుకున్నారు. ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణియన్, ఇన్ఫోసిస్ సీఈఓ పరేఖ్ కంటే కూడా అదానీ జీతం తక్కువగా ఉంది.


రెండు కంపెనీల నుంచి

10 లిస్టెడ్ అదానీ గ్రూప్(adani group) కంపెనీల వార్షిక నివేదికల ప్రకారం అదానీ (61) పోర్ట్స్-టు-ఎనర్జీ సెక్టార్‌లో పనిచేస్తున్న 10 గ్రూప్ సంస్థలలో కేవలం రెండింటి నుంచి మాత్రమే ఈ జీతం తీసుకున్నారు. ఈ గ్రూపులో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) నుంచి 2023-24లో జీతం రూపంలో రూ. 2.19 కోట్లు, ప్రయోజనాలు, ఇతర అలవెన్సులుగా రూ. 27 లక్షలు అందుకున్నారు. AEL వార్షిక నివేదిక ప్రకారం ఆయన మొత్తం జీతం రూ. 2.46 కోట్లు మునుపటి ఆర్థిక సంవత్సరం 2022-23 కంటే మూడు శాతం ఎక్కువ. ఇది కాకుండా అదానీ పోర్ట్స్, SEZ లిమిటెడ్ (APSEZ) నుంచి 6.8 కోట్ల రూపాయల వేతనం పొందారు.


అంబానీతో పోటీ..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం అదానీ నికర సంపద విలువ 106 బిలియన్ డాలర్లు( రూ. 88,57,67,27,00,000). ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచేందుకు అంబానీతో పోటీపడుతున్నారు. అత్యంత ధనవంతుడైన ఆసియన్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత ఆయన గ్రూప్ కంపెనీలలో షేర్ల విలువ గత సంవత్సరం 150 బిలియన్ డాలర్లు పడిపోయింది. ఈ ఏడాది అంబానీని రెండుసార్లు అధిగమించారు. అయితే ఇప్పుడు మళ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.


ప్రపంచ సంపన్నుల జాబితాలో 12వ స్థానం

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 114 బిలియన్ డాలర్ల( రూ. 95,26,17,63,00,000) ఆస్తులతో అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. కాగా ఈ జాబితాలో అదానీ 14వ స్థానంలో నిలిచారు. వార్షిక నివేదిక ప్రకారం అదానీ తమ్ముడు రాజేష్ ఏఈఎల్ నుంచి రూ.4.71 కోట్ల కమీషన్ లాభాలతో సహా రూ.8.37 కోట్లు అందుకున్నారు. కాగా, ఆయన మేనల్లుడు ప్రణబ్ అదానీ కమీషన్ రూ. 4.5 కోట్లతో కలిపి మొత్తం రూ.6.46 కోట్లు పొందారు.


ఇది కూడా చదవండి:

Onion Prices: గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధరలు, కారణమిదే


Next Week IPOs: ఐపీఓల వారం మళ్లీ వచ్చేసింది.. నెక్ట్స్ వీక్ ఏకంగా 10..


Gold and Silver Rates Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..

For Latest News and Business News click here

Updated Date - Jun 23 , 2024 | 01:32 PM