ITR Filing: కొత్త పన్ను రేటు వచ్చేసింది.. మినహాయింపులు, లాస్ట్ డేట్ తెలుసా
ABN , Publish Date - Jun 16 , 2024 | 12:24 PM
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్నును(Income Tax) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2024. ఇంకా 46 రోజులు మాత్రమే ఉంది. మరోవైపు ఇప్పటికే అనేక మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఫారం-16ను స్వీకరించారు. అయితే చాలా మంది పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానం గురించి అయోమయంలో ఉన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్నును(Income Tax) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2024. ఇంకా 46 రోజులు మాత్రమే ఉంది. మరోవైపు ఇప్పటికే అనేక మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఫారం-16ను స్వీకరించారు. ఈ క్రమంలో వారు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే చాలా మంది పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానం గురించి అయోమయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ విధానాల గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త పన్ను విధానంలో ఆదాయం, పన్ను మినహాయింపు పరిమితులు
3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదు
రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు: రూ. 3,00,000 కంటే ఎక్కువ ఆదాయంపై 5% పన్ను
రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్య ఆదాయంపై: రూ. 15,000 + రూ. 6,00,000 కంటే ఎక్కువ ఆదాయంపై 10% పన్ను
రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఆదాయంపై: రూ. 45,000 + రూ. 9,00,000 కంటే ఎక్కువ ఆదాయంపై 15% పన్ను
రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఆదాయంపై: రూ. 90,000 + రూ. 12,00,000 కంటే ఎక్కువ ఆదాయంపై 20% పన్ను
రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై: రూ. 150,000 + రూ. 15,00,000 కంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను
కొత్త పన్ను మినహాయింపుల జాబితా
వికలాంగులకు సంబంధించి రవాణా అలవెన్సులు (PwD), వాహన భత్యం
ప్రయాణం/పర్యటన/బదిలీ పరిహారం
స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కోసం సెక్షన్ 10(10C) కింద మినహాయింపు
సెక్షన్ 10(10) కింద గ్రాట్యుటీ మొత్తం
సెక్షన్ 10(10AA) కింద నగదు మినహాయింపు
సెక్షన్ 80CCH(2) ప్రకారం అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో డిపాజిట్ చేసిన మొత్తంపై మినహాయింపు
పాత పన్ను వ్యవస్థ
పాత పన్ను విధానంలో కూడా అనేక తగ్గింపులు ఉన్నాయి. ఇందులో ఇంటి అద్దె అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA), సెక్షన్ 80C, 80D, 80CCD(1b), 80CCD(2), ఇతరాల తగ్గింపులు కలవు వాటిలో..
పాత పన్ను విధానంలో రూ. 2.5 లక్షల వరకు ఆదాయం పన్ను నుంచి మినహాయింపు కలదు
పాత పన్ను విధానంలో రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఆదాయంపై 5% పన్ను విధించబడింది
ఈ విధానంలో రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య వ్యక్తిగత ఆదాయంపై 20% పన్ను విధించేవారు
పాత విధానంలో రూ. 10 లక్షలకు పైబడిన వ్యక్తిగత ఆదాయంపై 30% పన్ను విధించారు
కొత్త పన్ను విధానంలో మార్పులు
కొత్త ఆదాయపు పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానం. అందువల్ల ఒక వ్యక్తి ప్రత్యేకంగా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే తప్ప, వారి ఆదాయాలు కొత్త పన్ను విధానంలోకి మారవు
సెక్షన్ 87A కింద రాయితీ 5 లక్షల (రూ. 12,500 పన్ను రాయితీ) నుంచి రూ. 7 లక్షల (పన్ను రాయితీ రూ. 25,000)కి పెరిగింది.
రూ. 7 లక్షల వరకు పన్ను విధించదగిన ఆదాయంతో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే ఏ వ్యక్తి అయినా ఎలాంటి పన్నులు చెల్లించరని దీని అర్థం.
ఇంతకుముందు ఈ పన్ను రాయితీ రూ. 5 లక్షల పన్ను పరిధిలోకి వచ్చే వరకు అందుబాటులో ఉండేది
కొత్త పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు
కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను శ్లాబుల సంఖ్య ఆరు నుండి ఐదుకు తగ్గించబడింది
జీతం, పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ సౌకర్యం ఉంది
కొత్త పన్ను విధానంలో కుటుంబ పెన్షనర్లు రూ. 15,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు
కొత్త పన్ను విధానంలో అత్యధిక సర్‌ఛార్జ్ రేటు 37% 25%కి తగ్గించబడింది
ఇది కూడా చదవండి:
For Latest News and Business News click here