Share News

Spherical Egg: ఒక కోడి గుడ్డు ధర రూ. 21 వేలు.. స్పెషల్ ఏంటో తెలుసా..

ABN , Publish Date - Dec 19 , 2024 | 02:36 PM

ఒక కోడి గుడ్డుకు 20 వేల రూపాయలకుపైగా ఖర్చు చేశారు. అయితే ఆ గుడ్డు స్పెషల్ ఏంటి, ఎందుకు అంత రేటు, ఎక్కడ సేల్ చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Spherical Egg: ఒక కోడి గుడ్డు ధర రూ. 21 వేలు.. స్పెషల్ ఏంటో తెలుసా..
Spherical Egg

సాధారణంగా ఇండియాలో ఒక కోడి గుడ్డు ధర రూ. 5 నుంచి రూ. 10 మధ్య ఉంటుంది. కానీ ఎప్పుడైనా వేల రూపాయలు ఉన్న కోడి గుడ్డు గురించి విన్నారా. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఇటివల సంపూర్ణ గోళాకార గుడ్డ బ్రిటన్‌(Britain)లోని మార్కెట్‌లో 21 వేల రూపాయలకు విక్రయించబడింది. వేలంలో ఆ గుడ్డును 200 పౌండ్లకు (సుమారు రూ. 21,000) కొనుగోలు చేశారు. అయితే ఇది అసాధారణమైన గుడ్డు అని, ఓవల్ ఆకారాన్ని (SphericalEgg) కల్గి ఉందని చెబుతున్నారు. ఈ గుడ్డు ఆకారం పూర్తిగా వృత్తాకారంలో ఉన్నందున దీనిని బిలియన్‌లలో ఒకటిగా ఉంటుందని చెబుతున్నారు.


స్పెషల్ ఏంటో తెలుసా..

అందుకే దీనిని అరుదైన గుడ్డుగా పరిగణిస్తున్నారు. ఈ గుడ్డును బెర్క్‌షైర్‌లోని లాంబోర్న్ నివాసి ఎడ్ పావెల్ కొనుగోలు చేశారు. ఈ గుడ్డును ఈ నెల 11వ తేదీన వేలం వేశారు. స్కాట్లాండ్‌ నగరంలోని ఓ సూపర్‌మార్కెట్‌లో ఓ మహిళకు ఈ ప్రత్యేకమైన గుడ్డు దొరికింది. ఆమె దీనిని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చింది. ఇప్పుడు ఆ గుడ్డును వేలం వేశారు. ఈ గుడ్డును ఓవల్‌గా వర్ణిస్తున్నారు. కానీ చాలా గుడ్లు అండాకారంలో ఉంటాయి. పైభాగంలో తక్కువ సన్నగా, దిగువన మరింత విస్తరించి ఉంటాయి. ఇది గుండ్రంగా ఉంటుంది. ఈ గుండ్రని గుడ్డు చాలా పోషకమైనది కాదని, దాని పరిమాణం కారణంగా మాత్రమే ఇది ప్రత్యేకమైనదని చెబుతున్నారు.


కారణమిదేనా..

అయితే UKలో స్వచ్ఛంద సంస్థ కోసం విక్రయించబడిన ఈ అరుదైన గుడ్డు మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వారికి నిధులను సేకరించేందుకు యువెంటాస్ ఫౌండేషన్‌కు విరాళంగా అందించింది. సేకరించిన డబ్బుతో తాము మానసిక ఆరోగ్యంతో పోరాడుతున్న 13-25 ఏళ్ల వయస్సు గల వారికి సహాయం చేసేందుకు అందించనున్నట్లు తెలిపారు. ఈ గుడ్డు కాకుండా వేలం కార్యక్రమంలో దాదాపు 5000 పౌండ్ల విలువైన ఇతర వస్తువులను కూడా వేలం వేశారు.


గుడ్డు కొనుగోలుదారు ఏం అన్నారంటే..

కోడిగుడ్డును కొనుగోలు చేసిన పావెల్‌ను మీరు కొనుగోలు చేసినందుకు చింతిస్తున్నారా అని అడిగినప్పుడు, ఆయన విచారం వ్యక్తం చేయలేదు. చాలా సరదాగా ఉందని, దీని విషయంలో బాగా ఖర్చు చేసిన డబ్బు అని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు 2023లో ఆస్ట్రేలియాలో గుండ్రటి గుడ్డు రూ.78 వేలకు విక్రయించబడింది. అయితే ఈ గుడ్ల వేలం గురించి మీరు ఏమనుకుంటున్నారో అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.


ఇవి కూడా చదవండి:


Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 19 , 2024 | 02:40 PM