RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా
ABN , Publish Date - Dec 09 , 2024 | 05:43 PM
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ) పదవిని నిర్వహిస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా 1990 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) నియమితులైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ) పదవిని నిర్వహిస్తున్నారు. అంతకుముందు తన మునుపటి పదవిలో ఆయన భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. దీంతోపాటు ఆయనకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ఆర్థిక, పన్నుల రంగంలో మంచి అనుభవం ఉంది.
శక్తికాంత దాస్‌కి రేపు..
ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌కి రేపు చివరి రోజు. ఆ తర్వాత బుధవారం నుంచి కొత్త ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సంజయ్ మల్హోత్రా మూడేళ్లపాటు నియమితులయ్యారు. మల్హోత్రా నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సంజయ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆయన కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని అందుకున్నారు. ఆ తర్వాత అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల పర్యవేక్షణ
33 సంవత్సరాల పాటు తన కెరీర్‌లో నాయకత్వం, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, సంజయ్ మల్హోత్రా పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ మొదలైన విభిన్న రంగాలలో పనిచేశారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా ఉన్నారు. ఆ క్రమంలో ప్రత్యక్ష, ప్రత్యక్ష పన్నులకు సంబంధించి పన్ను విధాన రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతోపాటు సంజయ్ భారతదేశ ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలను పర్యవేక్షించారు. ప్రభుత్వ సంస్థ అయిన REC లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన గతంలో పనిచేసిన కాలంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించింది.
పన్ను విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర
డిసెంబర్ 2022 నుంచి రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న క్రమంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల కోసం పన్ను విధానాలను రూపొందించడంలో మల్హోత్రా కీలక పాత్ర పోషించారు. భారతదేశ ఆర్థిక ఆరోగ్యానికి ముఖ్యమైన అంశం అయిన పన్ను వసూళ్లను పెంచడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషించింది. మల్హోత్రా భారతదేశంలో వస్తువులు, సేవల పన్ను (GST) ఫ్రేమ్‌వర్క్‌ను నిర్వహించే బాధ్యత కలిగిన GST కౌన్సిల్ ఎక్స్-అఫీషియో కార్యదర్శిగా కూడా పనిచేశారు. జాతీయ పన్ను వ్యవస్థ సమగ్రతను కాపాడుతూ రాష్ట్రాల విషయంలో కొన్నిసార్లు విరుద్ధమైన ఆర్థిక అంచనాలను సమతుల్యం చేయడంలో సంజయ్ కృషి చేశారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Next Week IPOs: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. వచ్చే వారం ఏకంగా 11 ఐపీఓలు..
Free Government Schemes: ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ.. కారణమిదే..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Read More Business News and Latest Telugu News