Share News

Solar Power: ఈ స్కీంతో లైఫ్ లాంగ్ నో పవర్ బిల్..పైగా సంపాదించుకునే ఛాన్స్

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:15 AM

మీరు ప్రతి నెలా కరెంట్ బిల్లు ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పేరుతో ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సోలార్ రూఫ్‌టాప్ పథకాన్ని ప్రారంభించింది.

Solar Power: ఈ స్కీంతో లైఫ్ లాంగ్ నో పవర్ బిల్..పైగా సంపాదించుకునే ఛాన్స్

మీరు ప్రతి నెలా కరెంట్ బిల్లు(power bill) ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పేరుతో ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సోలార్ రూఫ్‌టాప్(PM Surya Ghar Muft Bijli Yojana) పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీం ద్వారా వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఫ్రీగా విద్యుత్ అందించనున్నారు. అందుకోసం మూడు కిలోవాట్‌ల వరకు కిలోవాట్‌కు రూ.30,000, 3 కిలోవాట్‌ల కంటే ఎక్కువ కనెక్షన్‌లకు కిలోవాట్‌కు రూ.18,000 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.

ఈ ఉచిత విద్యుత్ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి, మీరు గత ఆరు నెలల విద్యుత్ బిల్లును కలిగి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే ఇంటికి సోలార్ ప్యానెళ్ల(solar panels)ను అమర్చుకోవడానికి అనువైన పైకప్పు ఉండాలి. ఇది కాకుండా, కుటుంబానికి చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ కూడా అవసరం. మీరు ఏదైనా ఇతర సోలార్ ప్యానెల్‌పై సబ్సిడీని పొందుతున్నట్లయితే, మీరు సబ్సిడీ ప్రయోజనం పొందలేరు.


మీరు ఇంకా ఈ స్కీంలో నమోదు చేసుకోకుండా ఈ క్రింద తెలిపిన విధంగా వెంటనే నమోదు చేసుకోండి. ఈ పథకం ద్వారా వచ్చిన మిగులు విద్యుత్‌ను విక్రయించి డబ్బులు(money) కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. అయితే ఈ స్కీం ద్వారా వస్తున్న సబ్సిడీ కాకుండా మిగిలిన మొత్తాన్ని తీసుకునేందుకు పలు బ్యాంకుల ద్వారా రుణం కూడా తీసుకునే ఛాన్స్ ఉంది.

ఇలా దరఖాస్తు చేయండి

  • ఇక దీని కోసం అప్లై చేయాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.inకి వెళ్లి, రూఫ్‌టాప్ సోలార్ ను ఎంపిక చేసుకోవాలి

  • ఆ తర్వాత మీ రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ పేరును ఎంచుకోవాలి. ఆపై మీ విద్యుత్ వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్, ఇమెయిల్‌ను నమోదు చేయాలి

  • నెక్ట్స్ వినియోగదారు నంబర్, మొబైల్‌ను నమోదు చేయడం ద్వారా మీరు కొత్త పేజీలోకి లాగిన్ అవుతారు

  • అక్కడ ఫారంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

  • ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీకు ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాత మీరు మీ డిస్కామ్‌ పరిధిలో రిజిస్టర్ చేయబడిన ఏ విక్రేత నుంచి అయినా ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: మారిన ట్రెండ్.. బెండీ సమోసా చుశారా?

Updated Date - Mar 18 , 2024 | 11:15 AM