Share News

ట్రాఫిక్‌ ఎస్‌ఐని చెప్పుతో కొట్టిన మహిళ

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:44 AM

విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ(Traffic SI)ని చెప్పుతో కొట్టిన మహిళ సహా మరో ఇద్దరిని సేలం పోలీసులు(Selam Police) అరెస్టు చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సేలం జిల్లా శూరామంగళం ప్రాంతానికి చెందిన కార్తీక్‌ (43), ఈయన సోదరి కమలేశ్వరి (35), వీరి బంధువు మురళీకృష్ణన్‌ (28) కలిసి కారులో సేలం కొత్త బస్టాండుకు సోమవారం సాయంత్రం వెళ్ళారు.

ట్రాఫిక్‌ ఎస్‌ఐని చెప్పుతో కొట్టిన మహిళ

- ముగ్గురి అరెస్టు

చెన్నై: విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ(Traffic SI)ని చెప్పుతో కొట్టిన మహిళ సహా మరో ఇద్దరిని సేలం పోలీసులు(Selam Police) అరెస్టు చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సేలం జిల్లా శూరామంగళం ప్రాంతానికి చెందిన కార్తీక్‌ (43), ఈయన సోదరి కమలేశ్వరి (35), వీరి బంధువు మురళీకృష్ణన్‌ (28) కలిసి కారులో సేలం కొత్త బస్టాండుకు సోమవారం సాయంత్రం వెళ్ళారు. ఆ సమయంలో ట్రాఫిక్‌ అధికంగా ఉండటంతో కారును మరోచోట పార్కింగ్‌ చేసుకోవాలని విధుల్లో ఉన్న స్పెషల్‌ ఎస్‌ఐ శరవణవేలన్‌(SI Saravanavelan) సూచించారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: నటి కస్తూరిపై ఎంపీ రాజా ఆగ్రహం.. ద్రావిడ పాలనలో ఆర్య ఆధిక్యాన్ని సహించం


nani3.jpg

దీంతో వారు కారు తీసుకెళ్తుండగా, ట్రాఫిక్‌ పోలీసులు ఆపి తనిఖీ చేయడంతో ఆగ్రహించిన కమలేశ్వరి(Kamaleshwari) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆగ్రహించిన కమలేశ్వరి చెప్పు తీసుకుని ఎస్‌ఐను కొట్టడంతో మిగిలిన పోలీసులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ వెంటనే ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని మొత్తం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా

ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?

ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 06 , 2024 | 12:10 PM