Share News

Hyderabad: పబ్‌లో కొత్త రకం దందా.. ‘వలపు’ వల విసిరి దోపిడీ

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:05 AM

ఐటీ కారిడార్‌లో మరో కొత్త తరహా ఫ్రాడ్‌ బయటపడింది. డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన యువకులకు వాట్సా్‌ప్(Whatsapp)‏లో అమ్మాయిలతో మెసేజ్‌ చేయించి కలుద్దామని చెప్పి పబ్‌కు తీసుకువెళ్లి అక్కడ ఖరీదైన మద్యం కొనుగోలు చేయించి రెండింతల డబ్బులు వసూలు చేస్తూ పబ్‌ ఓనర్లు దోపిడీ చేస్తున్నారు.

 Hyderabad: పబ్‌లో కొత్త రకం దందా.. ‘వలపు’ వల విసిరి దోపిడీ

హైదరాబాద్‌ సిటీ: ఐటీ కారిడార్‌లో మరో కొత్త తరహా ఫ్రాడ్‌ బయటపడింది. డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన యువకులకు వాట్సా్‌ప్(Whatsapp)లో అమ్మాయిలతో మెసేజ్‌ చేయించి కలుద్దామని చెప్పి పబ్‌కు తీసుకువెళ్లి అక్కడ ఖరీదైన మద్యం కొనుగోలు చేయించి రెండింతల డబ్బులు వసూలు చేస్తూ పబ్‌ ఓనర్లు దోపిడీ చేస్తున్నారు. ఈ సంఘటన మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌(Madapur Police Station) పరిధిలో జరిగింది. నగరంలో ఉండే యువకుడికి డేటింగ్‌ యాప్‌లో రితికా అనే యువతి పరిచయం అయింది. తాను మేకప్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్నానని, నగరానికి కొత్తగా వచ్చానని చెప్పిన రితికా, ఇద్దరం ఒక ప్రాంతంలో కలుద్దామని చెప్పింది. వెంటనే అంగీకరించిన యువకుడిని హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్‌ సమీపంలోని పబ్‌కు రావాలని సూచించింది. మెట్రో స్టేషన్‌ వద్ద యువతిని కలిసిన తర్వాత ఇద్దరు కలిసి సమీపంలోని పబ్‌కు వెళ్లారు. పబ్‌లోకి వెళ్లిన తర్వాత యువతి ఖరీదైన మద్యం, భోజనం ఆర్డర్‌ చేసింది.

ఇదికూడా చదవండి: Hyderabad: ట్రాఫిక్‌జామ్‌లు, వరదనీటి నిల్వల పరిష్కారానికి కార్యాచరణ


మద్యం, భోజనం కలిపి బిల్లు రూ. 40 వేలు రావడంతో తప్పని పరిస్థితుల్లో చెల్లించి బయటపడ్డాడు. ఈ పబ్‌లో ఇదే తరహా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించిన ఇతడు, సోషల్‌ మీడియాలో తన గోడును వెల్లబుచ్చాడు. అతడితో పాటు మరో వ్యక్తి కూడా తనకు ఇదే తరహాలో రూ. 16 వేలు టోపీ పెట్టారని ఆవేదన వెళ్లగక్కారు. డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన వెంటనే పబ్‌కు ఆహ్వానించడం, భారీ స్థాయిలో బిల్లులు చేయడం జరిగిందని కొందరు తమకు జరిగిన అనుభవాలను పంచుకున్నారు. హెటెక్‌సిటీ మెట్రోస్టేషన్‌ సమీపంలోని మోష్‌ పబ్‌లోనే ఈ తరహా సంఘటనలు వెలుగులోకి రావడంతో పబ్‌ నిర్వాహకులు, మహిళలను ఏర్పాటు చేసుకొని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.


పబ్‌పై కేసు నమోదు..

ఈ సంఘటన అనంతరం బాధిత యువకుడు గూగుల్‌లో పబ్‌కు సంబంధించిన రివ్యూలను వెతికాడు. తనతో పాటు మరికొంతమంది యువకులు ఇదే తరహాలో మోసపోయినట్లు గుర్తించారు. డేటింగ్‌ యాప్‌ద్వారా అమ్మాయితో అబ్బాయిలను ట్రాప్‌ చేయించిన పబ్‌ మేనేజ్‌మెంట్‌ చీటింగ్‌ చేయిస్తుందని గుర్తించారు. పబ్‌ వసూలు చేసిన బిల్లు, తనకు జరిగిన చీటింగ్‌పై బాధితుడు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో మాదాపూర్‌ పోలీసులు శుక్రవారం సుమోటోగా ఫిర్యాదు స్వీకరించి మోష్‌ పబ్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన వారితో మోసాలు జరిగే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 10:05 AM