Share News

Hyderabad: చెల్లిని గర్భవతిని చేసిన అన్నకు యావజ్జీవ శిక్ష

ABN , Publish Date - Apr 24 , 2024 | 08:14 AM

వావివరుసలు మరిచిన ఓ యువకుడు సొంత చెల్లిపైనే అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నేరం రుజువవ్వడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Hyderabad: చెల్లిని గర్భవతిని చేసిన అన్నకు యావజ్జీవ శిక్ష

హైదరాబాద్‌ సిటీ: వావివరుసలు మరిచిన ఓ యువకుడు సొంత చెల్లిపైనే అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నేరం రుజువవ్వడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

భర్త వదిలేయడంతో ఓ మహిళ తన నలుగురు పిల్లలతో లంగర్‌హౌస్‌(Langerhouse) ప్రాంతంలో ఉంటోంది. బైక్‌ మెకానిక్‌గా పనిచేసే ఆమె కొడుకు(19) కొన్ని నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సొంత చెల్లి(13)ని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా 6 నెలల గర్భవతి అని వైద్యులు చెప్పారు.

ఇదికూడా చదవండి: Hyderabad: హాస్టల్‌ సంపులో పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

దాంతో తల్లి కూతురిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి అబార్షన్‌ చేయించేందుకు ప్రయత్నించింది. సాధ్యం కాకపోవడంతో భరోసా కేంద్రం సూచన మేరకు లంగర్‌హౌస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి బాలికను భరోసా కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. బాలికకు పుట్టిన బిడ్డకు పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు చేయించి నిందితుడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యాలు సమర్పించారు. కేసును విచారణ జరిపిన నాంపల్లి(Nampally) 12వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి అనిత నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఆహా.. ఏం ఐడియా గురూ.. ఉల్లిపాయల బస్తాల మాటున నిషేధిత విత్తనాల రవాణా

Read More Crime News and Telugu News


Updated Date - Apr 24 , 2024 | 08:14 AM