love not lust: మైనర్ బాలికపై అత్యాచారం..ఆ వ్యక్తికి బెయిల్ ఇస్తూ కోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Jan 13 , 2024 | 05:43 PM
ఓ 13 ఏళ్ల మైనర్‌పై లైంగిక దాడి జరిగిన విషయంలో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
ఓ 13 ఏళ్ల మైనర్‌పై లైంగిక దాడి జరిగిన విషయంలో బాంబే హైకోర్టు(bombay Court) నాగ్‌పూర్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు న్యాయమూర్తి ఊర్మిళ జోషి ఫాల్కే మాట్లాడుతూ ఇది నిందితుడు కామంతో బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు కాదని అన్నారు. ఇద్దరూ ప్రేమతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పింది. ఈ క్రమంలో కామం, ప్రేమ వేర్వేరు అని తెలిపింది. ఈ తీర్పు గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: ఆరో అంతస్తులో అగ్ని ప్రమాదం..18వ అంతస్తుకు వ్యాపించిన మంటలు!
అయితే ఈ ఘటన విషయంలో నిందితుడు నితిన్ ధబేరావ్‌పై బాధితురాలి తండ్రి కేసు పెట్టాడు. అతని 13 ఏళ్ల కుమార్తె ఆగస్టు 23, 2020న కొన్ని పుస్తకాలు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ ఆమె తిరిగి రాలేదని అతను ఆరోపించారు. దీంతో కూతురు కనిపించడం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు పోలీసులు ఆమెను అతనితో గుర్తించారు. నిందితుడితో కలిసి వెళ్లింది. తన వాంగ్మూలంలో మైనర్ నిందితుడితో తన ప్రేమను అంగీకరించింది. ఆగస్టు 22న ఆమె తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా ఆ సమయంలో నిందితుడు నితిన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత మైనర్ తన ఇంటి నుంచి నగలు, నగదు తీసుకుని నితిన్‌తో కలిసి వెళ్లిపోయింది.
ఆ క్రమంలో వారు మహారాష్ట్ర వెలుపల అనేక ప్రదేశాలలో కొన్ని రోజులు గడిపారు. అయితే ఆమె ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదని కోర్టు పేర్కొంది. అందుకే ప్రేమ వ్యవహారం కారణంగానే నిందితుడితో మైనర్ వెళ్లినట్లు స్పష్టమవుతోందని కోర్టు వెల్లడించింది. మైనర్ తనతో ఇష్టపూర్వకంగా వచ్చాడని నితిన్ తరపు లాయర్ బెయిల్ కోరాడు. కాగా మైనర్ సమ్మతి సంబంధించదనే వాదనతో ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది.
బాధితురాలి తరపు న్యాయస్థానం నియమించిన న్యాయవాది కూడా ప్రాసిక్యూషన్ వాదనకు మద్దతునిస్తూ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు. కానీ ప్రేమ వ్యవహారం వల్లే వారిద్దరూ కలిసి వెళ్లారని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసు 2020 సంవత్సరానికి చెందినది. కేసులో ఎటువంటి పురోగతి లేదని తెలిపారు. కేసు తుది పరిష్కారానికి సమయం పడుతుంది. ఈ దృష్ట్యా నిందితుడిని తదుపరి జైలులో ఉంచాల్సిన అవసరం లేదని, బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు.