Mahashivratri 2024: మహాశివరాత్రి రోజున రాత్రి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!
ABN , Publish Date - Mar 08 , 2024 | 08:25 PM
Mahashivratri 2024: భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందువు ఎంతో భక్తిప్రపత్తులతో, పరమనిష్ఠా గరిష్ఠలతో మహాశివరాత్రిని(Mahashivratri) జరుపుతారు. ఈ రోజున భక్తులు ఆ పరమేశ్వరుడిని(Lord Shiva) స్వచ్ఛమైన, పరిశుద్ధమైన మనసుతో, భక్తితో పూజిస్తారు(Devotees). మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడిని పూజించే భక్తులపై శివుడు కరుణ చూపుతాడని భక్తుల విశ్వాసం.
Mahashivratri 2024: భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందువు ఎంతో భక్తిప్రపత్తులతో, పరమనిష్ఠా గరిష్ఠలతో మహాశివరాత్రిని(Mahashivratri) జరుపుతారు. ఈ రోజున భక్తులు ఆ పరమేశ్వరుడిని(Lord Shiva) స్వచ్ఛమైన, పరిశుద్ధమైన మనసుతో, భక్తితో పూజిస్తారు(Devotees). మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడిని పూజించే భక్తులపై శివుడు కరుణ చూపుతాడని భక్తుల విశ్వాసం. అయితే, మహాశివరాత్రి రోజున రాత్రి చేపట్టే కొన్ని చర్యలు చాలా ఫలితం ఇస్తాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ సూచనలు పాటించడం ద్వారా మహా శివుడు సంతోషించి కరుణ చూపుతాడని, ఆయన ఆశీస్సులు అందజేస్తాడని అంటున్నారు. శివరాత్రి రోజున రాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఈ రోజు రాత్రి నిద్రపోకుండా జాగరణ చేసి, స్వామివారిని పూజిస్తే మేలు జరుగుతుందట. మరి శివరాత్రి రోజున రాత్రి ఏం చేయాలో తెలుసుకుందాం..
మహాశివరాత్రి రోజున ఈ పరిహారాలు చేయండి..
👉 మహాశివరాత్రి నాడు రాత్రిపూట శివాలయానికి వెళ్లి దీపం వెలిగించాలి. శివ పురాణం ప్రకారం.. కుబేరుడు తన పూర్వ జన్మలో శివరాత్రి రోజున శివలింగం ఎదుట దీపం వెలిగించాడు. మరుజన్మలో కుబేరుడు దేవతలకు కోశాధికారి కావడానికి ఇదే కారణం. ఈ రోజు శివలింగం వద్ద దీపం వెలిగిస్తే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయని విశ్వాసం.
👉 మహాశివరాత్రి రోజున, మీ ఇంటికి ఒక చిన్న శివలింగాన్ని తెచ్చి, రాత్రి మీ ఇంటి ఆలయంలో ప్రతిష్టించండి. మహాశివరాత్రి నుండి ప్రతిరోజు ఆ శివలింగాన్ని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోతుంది. ఈ పరిహారం చేయడం ద్వారా, శివునితో పాటు లక్ష్మీ దేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.
👉 శివరాత్రి రోజున రాత్రిపూట హృదయపూర్వకంగా శివయ్యను పూజించాలి. కనీసం 108 సార్లు 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపించాలి. మహాశివరాత్రి రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి.
👉 మహాశివరాత్రి రోజు రాత్రి హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శివునితో పాటు హనుమంతుడు సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహం వల్ల భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున రాత్రిపూట మంత్రాలను పఠించడం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.
👉 మహాశివరాత్రి రోజు రాత్రి వివాహిత స్త్రీకి వివాహ వస్తువులను బహుకరించడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుంది. అతని ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది.
👉 మహాశివరాత్రి నాడు పేదవారికి ఆహార ధాన్యాలు, డబ్బును దానం చేయడం చాలా పుణ్యంగా పరిగణించబడుతుంది. ఈ రోజు పేదలకు దానం చేయడం వల్ల పాపాలు నశించి శాశ్వతమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
👉 మహాశివరాత్రి రోజు రాత్రి ఏదైనా తీగచెట్టు కింద నిలబడి ఖీర్, నెయ్యి దానం చేస్తే మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈ పరిహారంతో జీవితాంతం ఆనందం, సుఖాలు పొందుతారు. మీరు చేపట్టే పనిలో విజయం సాధిస్తారు.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను శివపురాణం, ఇతర మత గ్రంధాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..