New York : అరుంధతీరాయ్‌కి అంతర్జాతీయ సంఘీభావం
ABN , Publish Date - Jul 20 , 2024 | 04:18 AM
ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్, ప్రొఫెసర్ షేక్ షౌఖత్ హుస్సేన్‌లపై ఉగ్రవాద నిరోధక చట్టం ‘ఉపా’ కింద విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి జారీ చేయటాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, కెనడాకు చెందిన 13 ప్రవాస భారతీయ సంఘాలు ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి.
న్యూయార్క్, జూలై 19: ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్, ప్రొఫెసర్ షేక్ షౌఖత్ హుస్సేన్‌లపై ఉగ్రవాద నిరోధక చట్టం ‘ఉపా’ కింద విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి జారీ చేయటాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, కెనడాకు చెందిన 13 ప్రవాస భారతీయ సంఘాలు ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘సాధారణంగానైతే ఇటువంటి ఫలితాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు తమ ఆధిపత్య పోకడలను మార్చుకుంటాయి. కానీ, మోదీ తన నియంతృత్వ ధోరణిని మార్చుకునే అవకాశాలు తక్కువని అర్థమవుతోంది’ అని ఈ ప్రకటనలో విమర్శించారు. 2010లో కశ్మీర్ గురించి రెచ్చగొట్టేలా ప్రసంగించారనే ఆరోపణలతో ఉపా కింద అరుంధతీరాయ్, ప్రొఫెసర్ హుస్సేన్‌లపై కేసు నమోదు చేయటాన్ని ప్రస్తావిస్తూ.. 14 ఏళ్ల తర్వాత ఈ కేసును ఎలా తిరగదోడుతారని, మోదీ నిరంకుశ పోకడలకు ఇది నిదర్శనమని అన్నారు.