Share News

PM Modi: ఆ తేదీల్లో మోదీ రష్యా, ఆస్ట్రియా పర్యటన.. చర్చించే అంశాలివే

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:52 PM

ప్రధాని మోదీ(PM Modi) విదేశీ పర్యటన ఖరారైంది. ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 8 నుంచి 10 వరకు పర్యటన సాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దళాల దాడులు జరుగుతున్న క్రమంలో 5 ఏళ్ల తరువాత మోదీ తొలిసారి రష్యాలో పర్యటించనున్నారు.

PM Modi: ఆ తేదీల్లో మోదీ రష్యా, ఆస్ట్రియా పర్యటన.. చర్చించే అంశాలివే

ఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) విదేశీ పర్యటన ఖరారైంది. ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 8 నుంచి 10 వరకు పర్యటన సాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వివరించారు.

ఉక్రెయిన్‌పై రష్యా దళాల దాడులు జరుగుతున్న క్రమంలో 5 ఏళ్ల తరువాత మోదీ తొలిసారి రష్యాలో పర్యటించనున్నారు. జులై 9న ఆస్ట్రియాని కూడా సందర్శిస్తారు. 40 సంవత్సరాల తరువాత ఆస్ట్రియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.


‘‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు మోదీ రష్యాలో పర్యటిస్తారు. జులై 8న క్రెమ్లిన్‌లోని ఓ సైనికుడి సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. ఆ తరువాత మాస్కోలోని ప్రదర్శన వేదికను సందర్శిస్తారు. 22వ భారత్- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని, ఆస్ట్రియాకు బయల్దేరుతారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌ డెర్‌ బెలెన్, ఛాన్సలర్‌ కర్ల్‌ నెహమెర్‌లతో చర్చలు జరుపుతారు’’ అని వినయ్ తెలిపారు. మోదీ రాక సందర్భంగా పుతిన్ ప్రైవేటు విందు ఏర్పాటు చేయనున్నారు.


భారతీయులతో ముఖాముఖి..

రష్యా ప్రభుత్వంతో చర్చలు ముగిశాక.. అక్కడ నివసిస్తున్న భారతీయులతో మోదీ మాట్లాడతారు. ఆస్ట్రియా పర్యటనలో ఉండగా.. ఆ దేశ అధ్యక్షుడితో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. "మోదీ జులై 9-10 తేదీల్లో ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఆ దేశంలో ఇదే తొలి పర్యటన. చివరిసారిగా 40 ఏళ్ల క్రితం భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది" అని వినయ్ వెల్లడించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 05 , 2024 | 04:53 PM