Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసు.. జైలు నుంచి ఆప్ ముఖ్య నేత విడుదల..
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:56 PM
దిల్లీ మద్యం కుంభకోణం ( Delhi Liquor Scam ) కేసులో అరెస్టై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇవాళ జైలు నుంచి బయటకు రానున్నారు. రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ సింగ్‌కు రూస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
దిల్లీ మద్యం కుంభకోణం ( Delhi Liquor Scam ) కేసులో అరెస్టై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇవాళ జైలు నుంచి బయటకు రానున్నారు. రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ సింగ్‌కు రూస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల బెయిల్ బాండ్‌ను సంజయ్ సింగ్ భార్య అనితా సింగ్ కోర్టుకు సమర్పించారు. సంజయ్ సింగ్ ఢిల్లీ-ఎన్‌సీఆర్ దాటి బయటకు వెళ్లకూడదని బెయిల్ లో షరతు విధించారు. పాస్‌పోర్ట్‌ను పోలీసులకు సమర్పించాలని, అందుబాటులో ఉండి విచారణకు సహకరించాలని బెయిల్ లో సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్ష్యాలను తారుమారు చేస్తే సహించేది లేదని హెచ్చరించింది.
BJP-AAP: బీజేపీలో చేరకుంటే నన్నూ అరెస్టు చేస్తారు.. కాక రేపుతున్న అతిశీ కామెంట్స్..
కాగా ఆరోగ్యం సమస్యల కారణంగా సంజయ్ సింగ్‌ను రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడే సంజయ్ కు బెయిల్ వచ్చిందని తమకు తెలిసిందని అనితా సింగ్ అన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన అనంతరం ఆయన తీహార్ జైలుకు వెళ్లారని చెప్పారు. అక్కడి నుంచి బెయిల్ పై విడుదల అవుతారని తెలిపారు. తన ముగ్గురు సోదరులైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ లు బయటకు వచ్చే వరకు తమ ఇంట్లో ఎలాంటి వేడుకలు నిర్వహించబోమని అనితా సింగ్ వివరించారు.
Congress : ఆయన సర్వాంతర్యామి.. ఆధిపత్యం చేయాలనుకోవడం మీ అవివేకం..
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో గతేడాది అక్టోబరు 4న సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయను జైల్లోనే ఉన్నారు. మంగళవారం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందారు. ఈ క్రమంలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు అనుమతించింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.