Share News

వ్యవసాయ ఉత్పత్తులకు ఏకరూప జాతీయ మార్కెట్లు

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:12 AM

దాదాపు మూడేళ్ల కిందట మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి, రైతుల ఆందోళనలతో వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ విషయంలో సంస్కరణలు తీసుకువచ్చింది.

వ్యవసాయ ఉత్పత్తులకు ఏకరూప జాతీయ మార్కెట్లు

న్యూఢిల్లీ, డిసెంబరు 28: దాదాపు మూడేళ్ల కిందట మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి, రైతుల ఆందోళనలతో వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ విషయంలో సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఏకరూప జాతీయ మార్కెట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. నూతన విధానం కింద ఒకే లైసెన్సు, ఒకే రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ, ఒకేసారి చెల్లించేలా ఫీజు ఉండనున్నాయి. ఇక, ఈ ముసాయిదా ప్రకారం.. ప్రైవేటు హోల్‌సేల్‌ మార్కెట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. వీటి ద్వారా ఉత్పత్తి, ఎగుమతిదారులు, రిటైల్‌ వ్యాపారులు, వ్యవస్థీకృత రిటైల్‌ వ్యాపారులు నేరుగా విక్రయాలు జరుపుకోవచ్చు. అదేవిధంగా గిడ్డంగులు, శీతల గోదాములను ప్రత్యేక మార్కెట్లుగా గుర్తిస్తారు. అలాగే, ప్రైవేటు ఈ-ట్రేడింగ్‌ వేదికల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్‌ రుసుములను ఒకేసారి నిర్ణయిస్తారు.

Updated Date - Dec 29 , 2024 | 04:12 AM